ఇండియాలో కొత్త 5G ప్రొసెసర్ లాంచ్!! Realme ఫస్ట్ ఫోన్

HIGHLIGHTS

ఇండియాలో Dimensity 700 5G ప్రొసెసర్

పవర్-ఎఫిషియంట్ తో వుంటుంది

పవర్-ఎఫిషియంట్ తో వుంటుంది

మీడియాటెక్ ఇండియాలో తన Dimensity 700 5G ప్రొసెసర్ ని ప్రకటించింది. వాస్తవానికి, 2020 నవంబర్ లో ఈ ప్రొసెసర్  ప్రపంచవ్యాప్తంగా విడుదల చెయ్యబడింది. అయితే, ఇప్పుడు Realme కొత్తగా చేసిన ప్రకటనలో Dimensity 700 5G ప్రొసెసర్ తో ఇండియాలో ఫస్ట్ ఫోన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు, తగిన సూచనలు కూడా ఆన్లైన్లో కనిపిస్తున్నాయి. గీక్ బెంచ్ లో కనిపించిన Realme 8 5G వస్తున్న రూమర్లు ఇదే ఆ ఫోన్ కావచ్చని సూచిస్తున్నాయి. కానీ, దీని పైన ఎటువంటి అధికారిక ప్రకటనలు మాత్రం లేవు.

ఇక ఈ Dimensity 700 5G ప్రొసెసర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ 5G ప్రొసెసర్ 8nm ఫ్యాబ్రికేషన్ చిప్ సెట్ కి సమానమైన పవర్-ఎఫిషియంట్ తో వుంటుంది. ఇది FHD+ డిస్ప్లేకి సపోర్ట్ చేస్తుంది మరియు 90Hz రిఫ్రెష్ రేట్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ Dimensity 700 5G ప్రొసెసర్ అల్ట్రా సేవ్ పవర్ సేవింగ్ మోడ్ తో వస్తుంది కాబట్టి బ్యాటరీ లైఫ్ మరింతగా పెంచుతుంది. ఇందులో వున్న కోర్స్ గురించి చూస్తే, ఇది ఆక్టా కోర్స్ తో వుంటుంది. వీటిలో, రెండు పెద్ద Cortex-A76 కోర్స్ మరియు ఆరు Cortex-A55 కోర్స్ తో జతగా వుంటుంది. ఇది Mali-G57 MC2 GPU వస్తుంది మరియు గరిష్టంగా 12GB LPDDR4X ర్యామ్ వరకూ సపోర్ట్ చేస్తుంది.

ఇక కెమెరాల పరంగా, Dimensity 700 5G ప్రొసెసర్ 64MP ప్రైమరీ కెమెరాకి జతగా రెండు 16MP కెమెరాల వరకూ సపోర్ట్ చేస్తుంది. ఇది AI బొకే, AI కలర్ మరియు AI బ్యూటీ మోడ్స్ వంటి వాటికీ సపోర్ట్ చేస్తుంది. ఇది లైట్ తక్కువ వుండే సమయాల్లో కూడా మంచి ఫోటోలను తియ్యడానికి వీలుగా హార్డ్-ఆధారిత ఇమేజింగ్ యాక్సిలరేటర్స్ ను కూడా కలిగివుంది.                                                                  

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :