క్వాడ్ యాక్షన్ కెమెరాతో విడుదలైన Lenovo Z 6 Pro

Updated on 05-Sep-2019

లెనోవా తన స్మార్ట్ ఫోనుగా Z 6 Pro ని  భారతదేశంలో లాంచనంగా విడుదల చేసింది. ఈ ఫోన్‌ను ఇప్పటికే 2019 ఏప్రిల్‌లో చైనాలో కంపెనీ లాంచ్ చేసింది. ఫోన్‌లో, మీరు ఒక 6.39-అంగుళాల FHD+, AMOLED డిస్ప్లేని పొందుతారు, ఇది 1,080 × 2,340 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుంది. అలాగే, ఈ ఫోనులో ప్రధాన ప్రాసెసర్ అయినటువంటి, స్నాప్‌డ్రాగన్ 855 SoC అమర్చారు. దీనిలో, వినియోగదారులు 12GB RAM ను పొందుతారు మరియు ఈ ఫోన్ బాక్స్ నుండి బయటకి వస్తూనే Android 9.0 తో నడుస్తుంది.

లెనోవా జెడ్ 6 ప్రో : ప్రత్యేకతలు

ఈ లెనోవా జెడ్ 6 ప్రో, ఒక 6.39-అంగుళాల పూర్తి హెచ్‌డి + అమోలెడ్ డిస్ప్లేని 1080 × 2340 పిక్సెల్స్ రిజల్యూషనుతో, ఒక 19.5: 9 యాస్పెక్ట్ రేషియాతో మరియు డిసిఐ-పి 3 కలర్ గాముట్ గల HDR 10 డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోనులో, 7nm ఫైన్ ఫిట్ టెక్నాలజీ గల ఒక స్నాప్‌డ్రాగన్ 855 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో లభిస్తుంది, ఇది అడ్రినో 640 GPU తో వస్తుంది. ఈ ఫోన్ బాక్స్ నుండి బయటకి వస్తూనే Android 9.0 తో నడుస్తుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే,  ఈ లెనోవా జెడ్ 6 ప్రోలో ఒక ప్రధాన 48 MP (f / 1.8) సెన్సార్‌ కి జతగా, మరొక 125 డిగ్రీల ఫీల్డ్ వ్యూ గల 16 MP లెన్స్ మరియు ఇంకొక 8 MP  మరియు 2 MP  సూపర్ వీడియో కెమెరాతో వస్తుంది. అలాగే, ముందు సెల్ఫీల కోసం ఒక 32 MP సెల్ఫీ కెమెరాను కూడా అందించారు. ఇక కనెక్టివిటీ ఫీచర్‌గా, ఫోన్‌లో 4 జీ VoLTE , డ్యూయల్-బ్యాండ్ వై-ఫై 802.11, బ్లూటూత్ 5.0, జీపీఎస్ ఉన్నాయి. దీనిలో, ఒక  27W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కి సపోర్ట్ చేసే 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కూడా అందించారు.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :