కేవలం రూ.6,299 ధరలో LAVA Z71 స్మార్ట్ ఫోన్ లాంచ్ : ఇవే ప్రత్యేకతలు

Updated on 17-Jan-2020
HIGHLIGHTS

బడ్జెట్ ధరలో మంచి ప్రాసెసర్ మరియు కెమేరాలతో వచ్చింది.

లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ తన కొత్త బడ్జెట్-సెంట్రిక్ స్మార్ట్‌ ఫోన్ LAVA Z71 ను భారతదేశంలో విడుదల చేసింది, దీన్ని కేవలం రూ. 6,299 రూపాయల ధరతో విడుదల చేసింది. ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ను, రూబీ రెడ్ మరియు స్టీల్ బ్లూ కలర్‌ ఎంపికలతో ఫ్లిప్‌కార్ట్ నుండి  కొనుగోలు చేయవచ్చు.

లావా Z71 లాంచ్ ఆఫర్

లావా సంస్థ, తన కొత్త స్మార్ట్‌ ఫోనుతో పాటుగా ప్రత్యేక జియో ఆఫర్లను కూడా ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కింద, వినియోగదారులు 1,200 రూపాయల తక్షణ క్యాష్‌ బ్యాక్ పొందవచ్చు మరియు లావా జెడ్ 71 స్మార్ట్‌ ఫోన్ను కొనుగోలు చేయడంలో అదనంగా 50GB డేటాను పొందవచ్చు. జియో వినియోగదారులకు రూ .198 మరియు రూ .299 ప్రీపెయిడ్ ప్లాన్ల పైన రూ .50 విలువైన 24 క్యాష్‌ బ్యాక్ వోచర్లు, మైజియో యాప్‌లో లభిస్తాయి.

లావా Z71 యొక్క ప్రధాన ఫీచరుగా, ప్రత్యేకమైన గూగుల్ అసిస్టెంట్‌ ను గురించి చెప్పొచ్చు. ఇది వినియోగదారులను వాయిస్ ఆదేశాల ద్వారా అనేక యాప్స్  మరియు ఫీచర్లను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.

లావా Z71 : ప్రత్యేకతలు

ఈ స్మార్ట్‌ ఫోనులో ఒక 5.7-అంగుళాల HD+ డాట్ నోచ్ డిస్ప్లే 1520 x 720 పిక్సెళ్ల రిజల్యూషన్ మరియు 19: 9 యాస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్ 2GHz క్వాడ్-కోర్ మీడియాటెక్ 16nm ప్రాసెసర్‌ తో 2GB RAM మరియు 32GB స్టోరేజితో జతచేయబడుతుంది. ఒక మైక్రో SD కార్డ్ ద్వారా ఫోను యొక్క స్టోరేజిని 256GB కి పెంచవచ్చు. ఈ ఫోనుకు ఫేస్ అన్‌లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందించారు.

ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ లావా జెడ్ 71 డ్యూయల్ కెమెరాతో వస్తుంది, దీనిలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఇవ్వబడింది.

ఈ కొత్త ఫోన్ ఆండ్రాయిడ్ 9 పై పనిచేస్తుంది మరియు 3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో జత చేయబడింది, ఇది ఒకే ఛార్జీలో 1.5 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని, కంపెనీ  పేర్కొంది. కనెక్టివిటీ కోసం, ఈ ఫోనులో డ్యూయల్ 4 జి VoLTE , బ్లూటూత్, వైఫై, డ్యూయల్ సిమ్, మైక్రో యుఎస్‌బి పోర్ట్, జిపిఎస్ ఉన్నాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :