Lava Yuva 3 Pro: కొత్త ఫోన్ లాంచ్ డేట్ చేసిన లావా.. ఫీచర్స్ లీక్ చేసిన లీక్ స్టర్లు.!

Lava Yuva 3 Pro: కొత్త ఫోన్ లాంచ్ డేట్ చేసిన లావా.. ఫీచర్స్ లీక్ చేసిన లీక్ స్టర్లు.!
HIGHLIGHTS

లావా తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Lava Yuva 3 Pro లాంచ్ డేట్ ను ప్రకటించింది

ఈ ఫోన్ కొత్త డిజైన్ మరియు లుక్స్ తో కనిపిస్తోంది

లీక్ స్టర్లు ఈ ఫోన్ యొక్క స్పెక్స్ మరియు ఫీచర్లను కూడా లీక్ చేశారు

దేశీయ మొబైల్ తయారీ కంపెనీ లావా తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Lava Yuva 3 Pro లాంచ్ డేట్ ను ప్రకటించింది. లావా ఈ స్మార్ట్ ఫోన్ ను డిసెంబర్ 14న మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫోన్ లాంచ్ గురించి చేస్తూ టీజర్ వీడియోని లావా యొక్క అధికారిక యూట్యూబ్ మరియు ట్విట్టర్ అకౌంట్స్ నుండి షేర్ చేసింది. ఈ ఫోన్ కొత్త డిజైన్ మరియు లుక్స్ తో కనిపిస్తోంది. కంపెనీ అందించిన లావా యువ 3 ప్రో టీజర్ ద్వారా ఈ ఫోన్ యొక్క చాలా వివరాలు అర్ధమవుతున్నాయి. అయితే, ప్రముఖ లీక్ స్టర్లు ఈ ఫోన్ యొక్క స్పెక్స్ మరియు ఫీచర్లను కూడా లీక్ చేశారు.

Lava Yuva 3 Pro: టీజర్

లావా యువ 3 ప్రో స్మార్ట్ ఫోన్ యొక్క టీజర్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ కెమేరా సెటప్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ చాలా సన్నగా కనిపిస్తోంది మరియు The Golden Standard క్యాప్షన్ తో వస్తోంది. అంటే, ఈ ఫోన్ చూడచక్కని గోల్డ్ కలర్ ఆప్షన్ లో వస్తోంది.

లావా యువ 3 ప్రో లీక్డ్ స్పెక్స్

ప్రముఖ టిప్స్టర్ పారాస్ గుగ్లాని లావా యువ 3 ప్రో అంచనా స్పెక్స్ ను తన ట్విట్టర్ అకౌంట్ నుండి లీక్ చేశారు. ఈ ట్వీట్ ప్రకారం, లావా యువ 3 ప్రో ఫోన్ 6.5 ఇంచ్ HD+ డిస్ప్లేని పంచ్ హోల్ సెల్ఫీ కెమేరా మరియు 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 50MP డ్యూయల్ కెమేరా మరియు 8MP సెల్ఫీ కెమేరా ఉన్నట్లు పారిస్ చెబుతున్నారు.

మరికొన్ని వివరాలను కూడా ఈ లీక్ ద్వారా వెల్లడించారు. ఈ ఫోన్ లో 8GB ర్యామ్ + 8GB ర్యామ్ వార్చువల్ ర్యామ్ ఫీచర్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నట్లు కూడా ఈ లీక్ ద్వారా తెలిపారు. మరింత ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఈ ఫోన్ అంచనా ధరను కూడా ఈ లీక్ ద్వారా బయటపెట్టారు.

Also Read : Redmi 13C: ధమాకా ఆఫర్ తో మరికొద్ది సేపట్లో స్టార్ట్ అవుతున్న రెడ్ మి బడ్జెట్ ఫోన్ సేల్.!

లావా యువ 3 ప్రో అంచనా ధర

లావా యువ 3 ప్రో స్మార్ట్ ఫోన్ ను రూ. 10,999 రూపాయల ధరలో లాంచ్ చేసే అవకాశం ఉండవచ్చని ఈ లీక్ ద్వారా వివరించారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo