Lava Storm 5G top 5 features and price details is here
చైనీస్ కంపెనీల స్మార్ట్ ఫోన్ లతో హోరెత్తుతున్న ఇండియన్ మార్కెట్ లో ప్రముఖ ఇండియన్ బ్రాండ్ లావా మరొక కొత్త 5G స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అదే, Lava Storm 5G స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో అందించి ఆకట్టుకుంటోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను కొత్త ప్రోసెసర్, ఫాస్ట్ ఛార్జ్ మరియు బిగ్ ర్యామ్ వంటి మరిన్ని ఫీచర్లతో లాంచ్ చేసింది లావా. మరి ఇండియన్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ లేటెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ టాప్ 5 ఫీచర్ల పైన ఒక లుక్కేద్దామా.
లావా ఈ స్మార్ట్ ఫోన్ ను 6.78 ఇంచ్ IPS డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ తో లాంచ్ చేసింది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో కలిగి వుంది మరియు 2.5D కర్వ్డ్స్ స్క్రీన్.
లావా ఈ లేటెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ ను MediaTek Dimensity 6080 ఆక్టా కోర్ 5జి ప్రోసెసర్ తో లాంచ్ చేసింది. ఇది బడ్జెట్ 5జి ప్రోసెసర్ మరియు ఈ ఫోన్ Android 13 ఆపరేటింగ్ సిస్టమ్ పైన పనిచేస్తుంది.
లావా ఈ స్టోర్మ్ 5జి స్మార్ట్ ఫోన్ ను 8GB RAM మరియు 8GB ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్ ఫీచర్ తో అందించింది. అంటే, ఈ ఫోన్ లో 16GB వరకూ ర్యామ్ సపోర్ట్ ను అందుకుంటారు. ఈ ఫోన్ లో 128GB (UFS 2.2) అంతర్గత మెమోరిని అందించింది మరియు మెమొరీ కార్డ్ ద్వారా స్టోరేజ్ ను 1TB వరకూ పెంచుకునే వీలుంది.
Also Read : Jio Best Offer: సంవత్సరం మొత్తం అధిక లాభాలను అందించే కొత్త ప్లాన్ తెచ్చిన జియో.!
ఈ ఫోన్ వెనుక 50MP డ్యూయల్ కెమేరా సెటప్ ను కలిగి వుంది మరియు 16MP సెల్ఫీ కెమేరా కూడా ఈ ఫోన్ లో వుంది. ఈ కెమేరాలో Film, Slow Motion, Timelapse, UHD వంటి మరిన్ని ఫీచర్లను కలిగి వుంది.
లావా స్టోర్మ్ 5జి స్మార్ట్ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్ ను త్వరగా ఛార్జ్ చెయ్యగల 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను Type-C పోర్ట్ తో అందించింది లావా.
ఈ టాప్ ఫీచర్లతో ఈ లావా కొత్త స్మార్ట్ ఫోన్ ఆకట్టుకుంటోంది. మరి ఈ ఫోన్ ధర కూడా తెలుసుకోవాలి కదా. ఈ ఫోన్ రేట్ ను ఇక్కడ చూడవచ్చు.
లావా ఈ ఫోన్ ను రూ. 13,499 లాంచ్ ఆఫర్ ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ ధరను మరింత సరసంగా మార్చాడనికి వీలుగా రూ. 1,500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా జత చేసింది. ఈ ఫోన్ డిసెంబర్ 28న మొదటిసారి సేల్ కి అందుబాటుకు వస్తుంది.