Lava O2 first sale in India today
ఈరోజు భారత్ మార్కెట్లో ప్రముఖ భారతీయ మొబైల్ తయారీ కంపెనీ లావా తన కొత్త ఫోను విడుదల చేసింది. అదే, Lava O2 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను చౌక ధరలో విడుదల చేసింది. అయితే, స్మార్ట్ ఫోన్ ను 16GB RAM ఫీచర్ మరియు పెద్ద డిస్ప్లేవంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో విడుదల చేసింది. లావా సరికొత్తగా విడుదల చేసిన లావా ఓ2 ఫోన్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్ చేద్దాం పదండి.
ముందుగా ఈ ఫోన్ ధర విషయానికి వస్తే, లావా ఈ ఫోన్ ను రూ. 8,499 రూపాయల ధరతో విడుదల చేసింది. లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ పైన రూ. 500 కూపన్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను రూ. 7,999 రూపాయల లాంఛ్ ఆఫర్ ధరకే పొందే వీలుంది.
ఈ ఫోన్ మార్చీ 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి అమెజాన్ మరియు కంపెనీ అధికారిక సైట్ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Also Read: Samsung Smart TV పైన బిగ్ డీల్ ఆఫర్ చేస్తున్న అమేజాన్.!
ఇక లావా ఓ2 స్మార్ట్ ఫోన్ స్పేస్ మరియు ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి వుంది. ఈ లావా ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు HD+ రిజల్యూషన్ కలిగిన 6.5 ఇంచ్ బిగ్ డిస్ప్లేని పంచ్ హోల్ సెల్ఫీ కెమేరాతో కలిగి వుంది. ఈ ఫోన్ ను Unisoc T616 SoC ని కలిగి వుంది మరియు ఇది 280K+ AnTuTu స్కోర్ ను అందిస్తుంది.
ఈ బడ్జెట్ ఫాస్ట్ ప్రోసెసర్ కి జతగా 8GB ఫిజికల్ ర్యామ్ మరియు 8GB ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్ తో కలిపి టోటల్ 16GB ర్యామ్ ఫీచర్ ను అందిస్తుంది. ఈ ఫోన్ లో వేగవంతమైన UFS 2.2 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా ఆఫర్ చేస్తోంది.
ఇక ఈ లావా ఫోన్ లో 50MP AI డ్యూయల్ రియర్ మరియు 8MP సెల్ఫీ కెమేరా ఉన్నాయి. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ లావా బడ్జెట్ ఫోన్ ఓ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్లాక్ ఉన్నాయి. లావా ఓ2 ఫోన్ బ్లోట్ వేర్ ఫ్రీ, క్లీన్ Android 13 OS తో పని చేస్తుంది.