Lava O2 coming soon with 50MP Ai dual camera and eye catching design
Lava O2: లావా అప్ కమింగ్ స్మార్ట్ కోసం చాలా ముందు నుండే టీజింగ్ మొదలు పెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంఛ్ డేట్ ను కంపెనీ ఇంకా ప్రకటించ లేదు. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ను డిజైన్ మరియు ఫీచర్స్ తో టీజింగ్ మాత్రం స్టార్ట్ చేసింది. ఈ ఫోన్ త్వరలో విడుదల చేస్తుందని లావా టీజర్ ద్వారా వెల్లడించింది. ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ యొక్క కొన్ని కీలకమైన వివరాలు వెల్లడయ్యాయి.
ఈ ఫోన్ లాంఛ్ డేట్ ను ఇంకా కంపెనీ ప్రకటించ లేదు. ఈ ఫోన్ లాంఛ్ గురించి ‘Coming Soon’ ని మాత్రమే చెబుతోంది. అయితే, ఈ ఫోన్ ను ఈ నెలలోనే విడుదల చేస్తుందని అంచనా వేస్తోంది. లావా ఓ2 స్మార్ట్ ఫోన్ ను కంపెనీ అమేజాన్ స్పెషల్స్ గా తీసుకు వస్తోంది. అందుకే, అమేజాన్ ఇండియా ఒక ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ ను మొదలు పెట్టింది.
లావా అధికారిక X అకౌంట్ నుండి అందించిన టీజర్ వీడియో మరియు ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ డిజైన్ అర్ధమవుతోంది. ఈ ఫోన్ చాలా సన్నగా మరియు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్ లో కనిపిస్తోంది. ఈ ఫోన్ ముందుగా వచ్చిన లావా O1 యొక్క నెక్స్ట్ జనరేషన్ ఫోన్ ను గా O2 ను తీసుకు వస్తున్నట్లు కనిపిస్తోంది.
Also Read: BSNL గుడ్ న్యూస్: ఈ ప్లాన్స్ పైన అధనపు వ్యాలిడిటీ ప్రకటించింది.!
ఈ ఫోన్ గురించి ప్రస్తుతానికి ఎటువంటి వివరాలను బయట పెట్టలేదు. అయితే, ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక 50MP AI డ్యూయల్ రియర్ కెమేరా ఉన్నట్లు కన్ఫర్మ్ చేసింది. రైట్ సైడ్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్ కలిగిన పవర్ బటన్ వాల్యూమ్ బటన్ ఉన్నాయి. ఈ ఫోన్ లో టైప్ C చార్జ్ పోర్ట్ మరియు పెద్ద స్పీకర్ గ్రిల్ అడుగు భాగంలో కనిపిస్తున్నాయి. అలాగే, ఈ ఫోన్ లో సెంటర్ పంచ్ హోల్ సెల్ఫీ కెమేరాని కూడా కలిగి వుంది.