లావా బ్లేజ్ ప్రో లాంచ్ కొత్త ముచ్చట్లు.!

HIGHLIGHTS

ఇటీవలే మంచి డిజైన్ తో Lava Blaze ను ప్రవేశపెట్టిన లావా

లావా బ్లేజ్ యొక్క ప్రో వెర్షన్ ను కూడా ప్రకటించింది

Lava Blaze Pro ను త్వరలో తీసుకువస్తున్నట్లు కంపెనీ తెలిపింది

ఇటీవలే మంచి డిజైన్ తో Lava Blaze ను ప్రవేశపెట్టిన లావా, ఈ ఫోన్ యొక్క ప్రో వెర్షన్ ను కూడా ప్రకటించింది. జూలై 2022 లో ఇండియాలో లావా బ్లేజ్ ను లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క ప్రొ వెర్షన్ Lava Blaze Pro కూడా ను త్వరలో తీసుకువస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను లావా 50MP మైన్ కెమెరా మరియు 5000 mAh హెవీ బ్యాటరీ వంటి ఫీచర్లతో తీసుకురావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

లావా బ్లేజ్ ప్రో 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ డిస్ప్లేని వాటర్ డ్రాప్ నోచ్ తో కలిగి వుంటుందని భావిస్తున్నారు. అయితే, లావా బ్లేజ్  లో కూడా ఇదే డిస్ప్లేని కలిగివుంది.  కాబట్టి, లావా బ్లేజ్ ప్రో లో డిస్ప్లే మరింత అప్గ్రేడ్ కావచ్చని అంచనా వేస్తున్నారు. లావా బ్లేజ్ ప్రో కూడా బ్లేజ్ మాదిరిగానే 5,000mAh బిగ్ బ్యాటరీని 10W ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ వైపు ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుందని ఊహిస్తున్నారు. ఈ ఫోన్ భారతదేశంలో నాలుగు రంగులలో వచ్చే అవకాశం ఉంది.

ఇక కెమెరా పరంగా ప్రో వెర్షన్ పెద్ద అప్గ్రేడ్ తో వస్తుంది. లావా బ్లేజ్ ప్రోలో 50MP ట్రిపుల్ కెమెరాలు 6x డిజిటల్ జూమ్‌ను అందిస్తాయి, ఇది లావా బ్లేజ్‌లోని 13MP ప్రధాన కెమెరా కంటే భారీ అప్‌గ్రేడ్. లావా బ్లేజ్ ఎంట్రీ లేవాలి ఫోన్ కాబట్టి, హీలియో A22 ప్రాసెసర్ తో వచ్చింది. అయితే, ప్రో వెర్షన్ మాత్రం అప్గ్రేడెడ్ SoC తో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ ధర విషయానికి వస్తే, లావా బ్లేజ్ ప్రో భారతదేశంలో దాదాపు రూ.10,000 ధరలో ఉంటుందని అంచనా వేయబడింది. అయితే, అధికారికంగా ప్రకటించబడినప్పుడు మాత్రమే మనం కరక్ట్ రేటును పొందుతాము.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :