Lava Blaze 5G కొనాలని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్.!

HIGHLIGHTS

Lava Blaze 5G కొనాలని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్

Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చింది

స్పెషల్ లాంచ్ అఫర్ లో భాగంగా ఈ ఫోన్ ను రూ.9,999 ధరతో సేల్ చేస్తోంది

లావా ఇటీవల ఇండియాలో విడుదల చేసిన బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్  Lava Blaze 5G కొనాలని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్.  Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ లావా అధికారిక వెబ్సైట్ మరియు అమెజాన్ నుండి ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి సేల్ అవుతోంది. ఇండియాలో అతితక్కువ ధరలో లాంచ్ అయిన 5G స్మార్ట్ ఫోన్ గా లావా బ్లేజ్ 5G నిలుస్తుంది.

Lava Blaze 5G: ధర

Lava Blaze 5G బేసిక్ వేరియంట్ ను రూ.10,999 ధరతో ప్రకటించింది. అయితే, స్పెషల్ లాంచ్ అఫర్ లో భాగంగా ఈ ఫోన్ ను రూ.9,999 ధరతో సేల్ చేస్తోంది.   ఇది కేవలం 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ కలిగిన సింగల్ వేరియంట్ తో వస్తుంది. ఈ ఫోన్ ను అమెజాన్ ద్వారా కొనుగోలు చేయడానికి Buy From Here పైన క్లిక్ చేయండి.   

Lava Blaze 5G: స్పెక్స్

ఈ స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో వస్తుంది మరియు ఈ నోచ్ లో 8MP సెల్ఫీ కెమెరాని కలిగి ఉంటుంది. సెక్యూరిటీ పరంగా ఈ ఫోన్ వెనుక ఫింగర్ ప్రింట్ స్కానర్ వుంది. లావా బ్లేజ్ 5G మీడియాటెక్ 5G ప్రాసెసర్ Dimensity 700 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 4G ర్యామ్ మరియు 3GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో కూడా వస్తుంది. స్టోరేజ్ పరంగా, ఈ ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

బ్లేజ్ 5G స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో EIS సపోర్ట్ కలిగిన 50MP మైన్ కెమెరాతో పాటుగా డెప్త్ మరియు మ్యాక్రో కెమెరాలు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 12 OS పైన పనిచేస్తుంది మరియు 5,000mAh బిగ్ బ్యాటరీతో ఉంటుంది. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, డ్యూయల్ సిమ్, Wi-Fi 6, బ్లూటూత్ 5.1, GPS, USB టైప్-C పోర్ట్ మరియు 3.5mm ఆడియో జాక్‌ లకు ఈ ఫోన్ లో సపోర్ట్ వుంది. ఈ ఫోన్ అన్ని ఇండియన్ బ్యాండ్ 5G లకు సపోర్ట్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :