బడ్జెట్ 5G ఫోన్ లావా బ్లేజ్ 5G సేల్ ప్రారంభం కానుంది.. ఎప్పుడంటే.!

HIGHLIGHTS

లావా బ్లేజ్ 5G సేల్ ప్రారంభం కానుంది

10 వేల కంటే తక్కువ ధరకే కొత్త బ్రాండెడ్ 5G స్మార్ట్ ఫోన్

లావా 5G ఫోన్ లో చాలానే ఆకర్షణీయమైన ఫీచర్లను జతచేసింది

భారతీయ మొబైల్ తయారీ కంపెనీ లావా రీసెంట్ గా లాంచ్ చేసిన బడ్జెట్ 5G ఫోన్ లావా బ్లేజ్ 5G సేల్ ప్రారంభం కానుంది. లావా ఈ 5G స్మార్ట్ ఫోన్ ను నవంబర్ 15 నుండి సేల్ కి అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను లావా స్పెషల్ లాంచ్ అఫర్ లో భాగంగా రూ.9,999 ధరతో ప్రకటించింది. అంటే, కేవలం 10 వేల కంటే తక్కువ ధరకే కొత్త బ్రాండెడ్ 5G స్మార్ట్ ఫోన్ ను మీరు పొందవచ్చు. ఈ ఫోన్ ను చాలా తక్కువ ధరలో లాంఛ్ చేసిన కూడా ఈ ఫోన్ లో చాలానే ఆకర్షణీయమైన ఫీచర్లను జతచేసింది. ఈ లేటెస్ట్ బడ్జెట్ 5G ఫోన్ గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని వివరాలను మీరు ఇక్కడ చూడవచ్చు.     

Lava Blaze 5G: ధర

Lava Blaze 5G  బేసిక్ వేరియంట్ ను స్పెషల్ లాంచ్ అఫర్ లో భాగంగా రూ.9,999 ధరతో ప్రకటించింది. ఇది కేవలం 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ కలిగిన సింగల్ వేరియంట్ తో వస్తుంది. ఈ ఫోన్ లావా అధికారిక సైట్ మరియు అమెజాన్ ద్వారా మాత్రమే లిస్టింగ్ చేయబడుతుంది.

Lava Blaze 5G: స్పెక్స్

ఈ స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో వస్తుంది మరియు ఈ నోచ్ లో 8MP సెల్ఫీ కెమెరాని కలిగి ఉంటుంది. సెక్యూరిటీ పరంగా ఈ ఫోన్ వెనుక ఫింగర్ ప్రింట్ స్కానర్ వుంది. లావా బ్లేజ్ 5G మీడియాటెక్ 5G ప్రాసెసర్ Dimensity 700 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 4G ర్యామ్ మరియు 3GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో కూడా వస్తుంది. స్టోరేజ్ పరంగా, ఈ ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

బ్లేజ్ 5G స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో EIS సపోర్ట్ కలిగిన 50MP మైన్ కెమెరాతో పాటుగా డెప్త్ మరియు మ్యాక్రో కెమెరాలు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 12 OS పైన పనిచేస్తుంది మరియు 5,000mAh బిగ్ బ్యాటరీతో ఉంటుంది. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, డ్యూయల్ సిమ్, Wi-Fi 6, బ్లూటూత్ 5.1, GPS, USB టైప్-C పోర్ట్ మరియు 3.5mm ఆడియో జాక్‌ లకు ఈ ఫోన్ లో సపోర్ట్ వుంది. ఈ ఫోన్ అన్ని ఇండియన్ బ్యాండ్ 5G లకు సపోర్ట్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :