Lava Blaze 2: కేవలం రూ.8,999 ధరలో భారీ ర్యామ్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ తో వచ్చింది.!

HIGHLIGHTS

లావా ఈరోజు ఇండియాలో తన సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది

భారీ ర్యామ్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది

Lava Blaze 2 రూ.8,999 ధరతో ఇండియాన్ మార్కెట్ లో విడుదల చెయ్యబడింది

Lava Blaze 2: కేవలం రూ.8,999 ధరలో భారీ ర్యామ్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ తో వచ్చింది.!

ప్రముఖ ఇండియన్  మొబైల్ తయారీ కంపెనీ లావా ఈరోజు ఇండియాలో తన సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. Lava Blaze 2 పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ భారీ ర్యామ్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే వంటి మరిన్ని ఆకర్షనీయమైన ఫీచర్లను కలిగి ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lava Blaze 2: ప్రైస్&సేల్ 

Lava Blaze 2 స్మార్ట్ ఫోన్ రూ.8,999 ధరతో ఇండియాన్ మార్కెట్ లో విడుదల చెయ్యబడింది. అయితే, ఇక్కడ సూచించిన ధరను స్పెషల్ లాంచ్ ధరగా కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్  ఏప్రిల్ 18వ తేది నుండి ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ మరియు లావా ఆన్లైన్ స్టోర్ నుండి సేల్ అవుతుంది. 

Lava Blaze 2: స్పెక్స్

ఈ స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే పంచ్ హోల్ నోచ్ డిజైన్ తో వస్తుంది మరియు ఈ నోచ్ లో 8MP సెల్ఫీ కెమెరాని కలిగి ఉంటుంది. సెక్యూరిటీ పరంగా ఈ ఫోన్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు ఫేస్ అన్లాక్ వుంది. ఈ ఫోన్ Unisoc T616 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో వస్తుందిస్. దీనికి జతగా 6G ర్యామ్ మరియు 5GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

బ్లేజ్ 2 స్మార్ట్ ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో 13MP మైన్ కెమెరాతో పాటుగా 2MP కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 12 OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 5,000mAh బిగ్ బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. 

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile