LAVA Agni 5G: భారీ ఫీచర్లతో వచ్చిన ఇండియన్ బ్రాండ్ 5G స్మార్ట్ ఫోన్

HIGHLIGHTS

LAVA ఈరోజు LAVA Agni 5G ని విడుదల చేసింది

LAVA Agni 5G కేవలం 8జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ వేరియంట్ తో వస్తుంది

బడ్జెట్ ధరలో వచ్చిన లావా అగ్ని 5G

భారతీయ మొబైల్ కంపెనీ LAVA ఈరోజు ఇండియాలో తన మొట్టమొదటి 5G స్మార్ట్ ఫోన్ LAVA Agni 5G ని విడుదల చేసింది. ఈ  స్మార్ట్ ఫోన్ అతితక్కువ ధరలో మీడియాటెక్ లేటెస్ట్ 5G ప్రోసెసర్ 64MP క్వాడ్ కెమెరా 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే వంటి టాప్ ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. మరి, ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం.

LAVA Agni 5G: ప్రైస్

LAVA Agni 5G కేవలం 8జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ వేరియంట్ తో వస్తుంది మరియు దీని ధర రూ.19,999 రూపాయలు. స్పెషల్ ఇంట్రడాక్టరీ అఫర్ క్రింద ఈ ఫోన్ ను రూ.17,999 రూపాయలకే అఫర్ చేస్తోంది. దీనికోసం, ఈ ఫోన్ ను Pre-Book చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఈ అఫర్ నవంబర్ 17 వరకూ మాత్రమే వర్తిస్తుంది.    

LAVA Agni 5G: స్పెసిఫికేషన్స్

ఈ లావా 5G ఫోన్ పెద్ద 6.78 అంగుళాల FHD+ పంచ్ హోల్ డిజైన్ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేటుతో కలిగివుంది. ఈ డిస్ప్లేని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో అందించింది మరియు ఇది 2.5D కర్వ్డ్ స్క్రీన్ . ఈ ఫోన్‌లో స్పీడ్, గేమింగ్ మరియు మల్టీ టాస్కింగ్ అందించడానికి మీడియాటెక్ డైమెన్సిటీ 810 SoC ని కలిగి వుంది.

ఈ ప్రొసెసర్ గరిష్టంగా 2.4 Ghz స్పీడ్ కలిగిన ఆక్టా కోర్ SoC మరియు Arm Mali-G57 MC2 GPU తో జతగా ఉంటుంది మరియు 6nm ప్రోసెసర్. ఇది మంచి గేమింగ్ మరియు 5G సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితమైన స్టాక్ ఆండ్రాయిడ్ 11 పైన నడుస్తుంది మరియు ఎటువంటి బ్లాట్ వేర్ లేకుండా అప్డేట్స్ ను త్వరగా అందుకుంటుంది. 

లావా అగ్ని 5G స్మార్ట్ ఫోన్ వెనుక అందమైన డిజైన్ లో క్వాడ్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఈ సెటప్ లో 64ఎంపి ప్రధాన కెమెరా, 5ఎంపి  వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా మరియు 2ఎంపి డెప్త్ సెన్సార్ లను అందించింది మరియు డ్యూయల్ LED ఫ్లాష్ లైట్ ను కూడా కెమెరాతో జతగా ఇచ్చింది. ముందుభాగంలో, 16ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది.

లావా అగ్ని 5G ఫోన్ 5000 mAh బ్యాటరీని 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించింది. ఈ ఫోన్ లో వేలిముద్ర సెన్సార్ ను సైడ్ లో ఇచ్చింది మరియు ఫేస్ అన్లాక్ కు కూడా సపోర్ట్ వుంది.                  

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :