Lava Agni 4 launching soon in india
Lava Agni 4 : ప్రముఖ భారతీయ స్మార్ట్ ఫోన్ కంపెనీ లావా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం టీజింగ్ ప్రారంభించింది. అగ్ని సిరీస్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అయితే, ఇది అగ్ని 4 స్మార్ట్ ఫోన్ అని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అంచనా ఫీచర్స్ కూడా అంచనా వేసి చెబుతున్నారు. మరి లావా ప్రకటించిన ఈ అప్ కమింగ్ ఫోన్ కంపెనీ వెల్లడించిన మరియు ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్న ఫీచర్స్ రెండు వివరాల పై ఒక లుక్కేద్దామా.
లావా అగ్ని సిరీస్ నుంచి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను త్వరలో లాంచ్ చేస్తున్నట్లు లావా అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ అగ్ని 4 అవుతుందని అంచనా వేసి చెబుతున్నారు. ఇప్పటికే అగ్ని 3 ఫోన్ వచ్చింది కాబట్టి ఇది నెక్స్ట్ జనరేషన్ ఫోన్ అగ్ని 4 అవుతుందని మంచి ఊహించవచ్చు.
ఆన్లైన్ లో లీకైన మరియు కొత్త రిపోర్ట్ చెబుతున్న అంచనా స్పెక్స్ మరియు ఫీచర్స్ ఈ ఫోన్ కీలక ఫీచర్స్ వెల్లడిస్తున్నాయి. ఈ కొత్త లీక్స్ మరియు రిపోర్ట్స్ ప్రకారం, లావా అగ్ని 4 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 8350 చిప్ సెట్ తో లాంచ్ కావచ్చు. ఈ ఫోన్ 6.78 ఇంచ్ AMOLED స్క్రీన్ ని 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొప్ప బ్రైట్నెస్ తొ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సరికొత్త డిజైన్ మరియు సరికొత్త కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని కూడా అంచనా వేసి చెబుతున్నారు.
కెమెరా పరంగా, ఈ అప్ కమింగ్ లావా స్మార్ట్ ఫోన్ పిల్ షేప్ కెమెరా కలిగి ఉంటుదని మరియు ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా ఉండవచ్చు. ఇందులో 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరాతో డ్యూయల్ ఫ్లాష్ LED లైట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ భారీ 7000 mAh బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుందని అంచనా వేసి చెబుతున్నారు.
Also Read: OPPO Enco X3s ఇయర్ బడ్స్ ని Dynaudio వంటి ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేసింది.!
అయితే, వాస్తవానికి లావా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ లేదా ఫోన్ ఫీచర్స్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. అయితే, త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు కూడా లావా వెల్లడించే అవకాశం ఉంది. అప్పటి వరకు లీక్స్ మరియు అంచనా ఫీచర్స్ ద్వారా ఫోన్ ను అంచనా వేయాల్సి ఉంటుంది.