Lava Agni 4 first sale starts with big deal on tomorrow
లావా సరికొత్తగా అందించిన లేటెస్ట్ బడ్జెట్ ప్రీమియం ఫోన్ Lava Agni 4 ఫస్ట్ సేల్ భారీ ఆఫర్ తో రేపు స్టార్ట్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ నుంచి డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఫోన్ ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ మాత్రమే కలిగి ఉండే మెటల్ ఫ్రేమ్ డిజైన్ తో వస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ స్మార్ట్ ఫోన్ మరిన్ని భారీ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సేల్ కంటే ఈ ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
లావా ఈ కొత్త ఫోన్ ను రూ. 24,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఇది లాంచ్ ధర ఈ ఫోన్ ఫస్ట్ సేల్ నుంచి నుంచి రూ. 22,999 ధరకే అందుకునేలా బిగ్ డీల్ కూడా అందించింది. అదేమిటంటే, ఈ ఫోన్ ఎడ్ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు తో తీసుకునే వారికి రూ. 2,000 డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో లావా అగ్ని 4 స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 22,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. అయితే, ఈ ఆఫర్ కేవలం నవంబర్ 25వ తేదీ జరిగే ఫస్ట్ సేల్ ఒక్కరోజు మాత్రమే లభిస్తుంది. ఇప్పటివరకు ఈ ఫోన్ ప్రైస్ అండ్ ఆఫర్స్ మాత్రమే చూసాం, మరి ఇప్పుడు ఈ ఫోన్ ఫీచర్స్ చూద్దాం.
లావా ఈ ఫోన్ ను కేవలం ప్రీమియం సెగ్మెంట్ లో మాత్రమే ఉండే అల్యూమినియం ఫ్రేమ్ తో అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ ప్రీమియం డిజైన్ మరియు 360 డిగ్రీల యాంటెన్నా సపోర్ట్ మరియు స్టన్నింగ్ లుక్స్ కలిగిన డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ 14లక్షల కంటే ఎక్కువ AnTuTu స్కోర్ అందించే మీడియాటెక్ Dimensity 8350 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఇది 8 జీబీ LPDDR5x ర్యామ్ మరియు 256 జీబీ (UFS 4.0) స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్ మరియు గొరిల్లా గ్లాస్ 5 రక్షణ కలిగిన 6.67 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 120Hz రేట్, 2400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 100 శాతం NTSC కలర్ గాముట్ తో వస్తుంది. ఈ ఫోన్ IP64 వాటర్ స్ప్లాష్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఫోన్ IR బ్లాస్టర్, బ్లూటూత్ 5.4, దూల స్టీరియో స్పీకర్లు మరియు X -యాక్సిస్ లైనర్ మోటార్ వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Moto G57 Power ఆండ్రాయిడ్ 16 వంటి భారీ ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!
ఈ ఫోన్ కెమెరా వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ లో వెనుక 50MP మెయిన్ + 8MP అల్ట్రా వైడ్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ 60FPS తో 4K వీడియో రికార్డ్ చేసే సత్తా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 5000 mAh బ్యాటరీ మరియు 66W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ అందించింది. ఈ ఫోన్ ను వేగంగా చల్లబరిచే 3D వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం కూడా ఉంది.