Lava Agni 2 5G పైన ధమాకా ఆఫర్ ప్రకటించిన అమేజాన్.!

HIGHLIGHTS

అమేజాన్ ఈరోజు అతిభారీ 5G స్మార్ట్ ఫోన్ డీల్ ను ప్రకటించింది

Lava Agni 2 5G పైన ఈ ధమాకా ఆఫర్ ను అందించింది

రూ. 4,000 రూపాయల వరకూ లాభాలను అగ్ని 2 ఫోన్ పైన అందుకోండి

అమేజాన్ ఇండియా ఈరోజు అతిభారీ 5G స్మార్ట్ ఫోన్ డీల్ ను ప్రకటించింది. ప్రముఖ ఇండియన్ మొబైల్ కంపెనీ లావా యొక్క బడ్జెట్ కర్వ్డ్ స్మార్ట్ ఫోన్ Lava Agni 2 5G పైన ఈ ధమాకా ఆఫర్ ను అందించింది. నిన్న మొన్నటి వరకూ రూ. 21,999 రూపాయల ధరలో భారీ ఫీచర్స్ మరియు కర్వ్డ్ డిస్ప్లేతో వచ్చిన లావా అగ్ని 2 5జి స్మార్ట్ ఫోన్ నుఈరోజు రూ. 2,000 భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఇది కాకుండా రూ. 4,000 రూపాయల వరకూ మరిన్ని ఇతర డిస్కౌంట్ లను కూడా ఈ ఫోన్ పైన అందిస్తోంది.

Lava Agni 2 5G

లావా అగ్ని 2 5జి స్మార్ ఫోన్ ను 23% డిస్కౌంట్ తో రూ. 19,999 ధరతో లిస్ట్ చేసింది అమేజాన్. ఈ ఫోన్ ను Citibank క్రెడిట్ కార్డ్ EMI తో కొనే వారికి రూ. 1,000 డిస్కౌంట్, OneCard క్రెడిట్ కార్డ్ EMI తో కొనే వారికి రూ. 1,200 డిస్కౌంట్ లభిస్తుంది. ఇందంతా ఒక ఎత్తైతే, ఈ ఫోన్ ను వారి పాత స్మార్ట్ ఫోన్ తో ఎక్స్ చేంజ్ చేసే యూజర్లకు రూ. 3,000 రూపాయల భారీ ఎక్స్ ఛేంజ్ బోనస్ డిస్కౌంట్ ను అందిస్తోంది. ఈ అంటే, ఈ ఆఫర్ లతో లావా అగ్ని 2 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 16,999 రూపాయలకే అందుకునే వీలుంది. ఈ ఫోన్ ను ఆఫర్ ధరతో కొనడానికి Buy From Here లింక్ పైన నొక్కండి.

Also Read : WhatsApp లో మరొక అద్భుతమైన ఫీచర్ తెచ్చింది.!

లావా అగ్ని 2 5జి స్పెక్స్ మరియు ఫీచర్లు

లావా అగ్ని 2 5జి స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో ఇండియన్ బ్రాండ్ నుండి వచ్చిన ఫస్ట్ కర్వ్డ్ డిస్ప్లే 5G స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, Widevine L1 సర్టిఫికేషన్ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన 6.78 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ వెనుక కూడా 3D Curved గ్లాస్ బ్యాక్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ పవర్ ఫుల్ ప్రోసెసర్ Dimensity 7050 తో పనిచేస్తుంది.

Lava Agni 2 5G Features

ఈ ఫోన్ 8GB + 8GB వర్చువల్ ర్యామ్ మరియు 256GB భారీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. కెమేరా పరంగా కూడా ఈ ఫోన్ ఆకట్టుకుంటుంది. ఎందుకంటే, ఈ ఫోన్ లో వెనుక పెద్ద 1.0µm పిక్సెల్ 50MP క్వాడ్ కెమేరా సెటప్ ను కలిగి వుంది. ఈ మెయిన్ కెమేరాకి జతగా 8MP అల్ట్రా వైడ్ + 2MP మ్యాక్రో + 2MP డెప్త్ కెమేరాలు ఉన్నాయి. ఈ ఫోన్ లో 66W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4700 mAh బ్యాటరీ కూడా వుంది.

ఈ ఫోన్ ధర కేటగిరి మరియు ఆఫర్ల దృశ్యా అతితక్కువ ధరలో వచ్చే ఆల్రౌండ్ ఫోన్ అని చెప్పవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :