బడ్జెట్ Curve Display 5G ఫోన్ Agni 2 నెక్స్ట్ సేల్ అనౌన్స్ చేసిన లావా.!

HIGHLIGHTS

బడ్జెట్ Curve Display 5G ఫోన్ Agni 2 నెక్స్ట్ సేల్ అనౌన్స్

కంపెనీ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ నుండి వెల్లడించింది

Lava Agni 2 5G నెక్స్ట్ సేల్ కోసం చూస్తున్న వారికీ గుడ్ న్యూస్

బడ్జెట్ Curve Display 5G ఫోన్ Agni 2 నెక్స్ట్ సేల్ అనౌన్స్ చేసిన లావా.!

ఇండియన్ మొబైల్ బ్రాండ్ Lava ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసిన బడ్జెట్ Curve Display 5G ఫోన్ Agni 2 నెక్స్ట్ సేల్ అనౌన్స్ చేసింది. మే 24 న ఉదయం 10 గంటలకు మొదలైన ఫస్ట్ సేల్ కేవలం గంటలోనే ముగిసింది. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ నుండి వెల్లడించింది. అయితే, అప్పటి నుండి నెక్స్ట్ సేల్ యెప్పుడ్డు జరుగుతుందా అని ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు ఈ నెక్స్ట్ సేల్ డేట్ అనౌన్స్ చేసి ఖుషి చేసింది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lava Agni 2 5G: నెక్స్ట్ సేల్ 

లావా అగ్ని నెక్స్ట్ సేల్ నుండి మే 31 వ తేదీ మధ్యాహ్నం నిర్వహిస్తుట్లు కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ ద్వారా సేల్ కి అందుబాటులో ఉంటుంది మరియు ఈ ఫోన్ రూ. 2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ కి వస్తుందిని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ రూ. 21,999 ధరతో ,లిస్టింగ్ చెయ్యబడింది మరియు బ్యాంక్ కార్డ్స్ ద్వారా ఈ ఫోన్ ను రూ. 19,999 అఫర్ ధరకే అందుకునే వీలుంది. 

 

 

Lava Agni 2 5G పైన ఎందుకు అంత క్రేజ్?

Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్ ను లావా కేవలం 20 వేల రూపాయల ఉప బడ్జెట్ లోనే Curved Display తో అందించడం ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. కేవలం ఇది మాత్రమే కాదు ఈ బడ్జెట్ Dimensity 7050 ఫాస్ట్ ప్రోసెసర్ మరియు 256 GB హెవీ 8 GB ర్యామ్ కి జతగా 8GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ ను అందించడం కూడా కారణాలుగా చెప్పవచ్చు. 

ఇవన్నీ ఒక ఎత్తైతే, లావా ఈ ఫోన్ పైన అందించిన 'Free Phone Replacement' ఒక ఎత్తని చెప్పాలి. అంటే, ఈ ఫోన్ లో ఏదైనా టెక్నీకల్ సమస్యలు తెలెత్తితే కొత్త ఫోన్ ను రీప్లేస్ చేస్తానని కంపెనీ ప్రకటించింది. ఈ ఫీచర్ లతో ఈ ఫోన్ పైన హైప్ ను మరింతగా పెంచేసింది. 

మరి మే 31 న మరొకసారి సేల్ కి వస్తున్నా ఈ ఫోన్ అమ్మకాలు ఈసారి ఎలా ఉంటాయో చూడాలి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo