కేవలం రూ. 6,975 ధరకే లేటెస్ట్ NOKIA స్మార్ట్ ఫోన్

Updated on 30-Dec-2019
HIGHLIGHTS

ఇందులో గూగుల్ అసిస్టెంట్ కోసం ఒక డేడికేటెడ్ బటన్ అందించింది.

నోకియా 4.2 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఎన్నడూ ఊహించనంత తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్, నోకియా నుండి వచ్చిన మొట్టమొదటి వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే స్మార్ట్ ఫోనుగా కూడా ప్రసిద్ధిపొందింది. అధనంగా, ఈ ఫోనులో అందించిన ప్రత్యేకమైన గూగుల్ అసిస్టెంట్ బటన్ ఈ స్మార్ట్ ఫోన్ను ఆకట్టుకునేలా చేస్తుంది. ముందుగా ఈ స్మార్ట్ ఫోన్ను రూ.10,999 రూపాయల ధరట్లో ఇండియాలో అమ్ముడు చేశారు. అయితే, అమేజాన్ ఈ స్మార్ట్ ఫోన్ పైన గరిష్టంగా 4,000 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ.6,975 ధరకే అమ్మడుచేస్తోంది.      

నోకియా 4.2 ప్రత్యేకతలు

ఈ నోకియా 4.2 స్మార్ట్ ఫోన్ 720 x 1520 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 5.71 అంగుళాల HD+ LCD డిస్ప్లేతో ఉంటుంది. అధనంగా, ఈ డిస్ప్లేని ఒక U ఆకారంలో వున్న నోచ్ డిజైన్ తో అందించారు మరియు ఈ నోచ్ లో సెల్ఫీ కెమేరా ఉంటుంది. ఇది ఒక 19:9 ఆస్పెక్ట్ రేషియాతో, ఎక్కువ స్క్రీన్ స్థలాన్ని అందిస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 439 ఆక్టా కోర్ ప్రాసెస్సర్ శక్తితో నడుస్తుంది. ఇది 3GB ర్యామ్ కి జతగా  32GB స్టోరేజితో లభిస్తుంది.  అలాగే, మైక్రో SD కార్డుతో 400GB వరకు మెమొరీ సామర్ధ్యాన్ని పెంచుకునే వీలుంటుంది.

ఇక కెమెరా విభాగానికి వస్తే, f/2.2 అపర్చరు  కలిగిన ఒక 13MP ప్రధాన కెమేరాకి జతగా మరొక 2MP ( f/2.2) డెప్త్ కెమేరాతో, డ్యూయల్ రియర్ కెమెరాని అందించారు. ముందుభాగంలో, ఒక 8MP కెమేరాని f /2.0 అపర్చరుతో అందించారు. అయితే, ఇందులో గూగుల్ అసిస్టెంట్ కోసం ఒక డేడికేటెడ్ బటన్ అందించింది. ఇందులో 3,000 mAh ఇంటిగ్రేటెడ్ బ్యాటరీని అందించింది. ఇది Android 9 Pie OS పైన నడుస్తుంది మరియు ఆండ్రాయిడ్ వన్ కార్యక్రంలో భాగంగా ఉంటుంది కాబట్టి అప్డేట్లను త్వరగా అందుకుంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :