Jio Vivo జతగా ఎక్స్ క్లూజివ్ అఫర్: చవక ధరకే స్మార్ట్ ఫోన్ మరియు భారీ ఆఫర్లు

Updated on 21-Dec-2020
HIGHLIGHTS

Jio Vivo జతగా ఎక్స్ క్లూజివ్ అఫర్

జియో తన భారీ అఫర్ తో మరొకసారి వార్తల్లో నిలిచింది.

2020 సంవత్సరం ముగుస్తుండగా ఈ అఫర్ ను ప్రకటించింది.

రిలయన్స్ జియో తన భారీ అఫర్ తో మరొకసారి వార్తల్లో నిలిచింది. 2020 సంవత్సరం ముగుస్తుండగా ఈ అఫర్ ను ప్రకటించింది. ఇప్పుడు Jio Vivo జతగా ఎక్స్ క్లూజివ్ అఫర్ లో భాగంగా ఇండియాలో చవక ధరకే Vivo స్మార్ట్ ఫోన్ మరియు దాని పైన Jio Exclusive బెనిఫిట్ ఆఫర్లను ప్రకటించింది. ఈ అఫర్ గురించి వివరంగా చూద్దాం.

గత కొంతకాలం Jio మరియు Vivo జతగా 4G స్మార్ట్ ఫోన్ను ఇండియాలో విడుదల చెయ్యవచ్చని అనేకమైన వార్తలు వచ్చాయి. వార్తలు వచ్చిన కొద్దిరోజుల్లోనే Jio Vivo ఎక్స్ క్లూజివ్ Vivo Y1s 4G స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 7999 రూపాయల ధరతో మరియు 4550 రుపాయల భారీ బెనిఫిట్స్ తో తీసుకొచ్చింది.   

Jio Vivo ఎక్స్ క్లూజివ్ అఫర్

 Vivo Y1s స్మార్ట్ జియో భారీగానే బెనిఫిట్స్ ను ప్రకటించింది. ఈ ఫోనును జియో లైఫ్ తో కొనుగోలు చేసేవారికి 4550 రుపాయల వరకూ బెనిఫిట్స్ లభిస్తాయని జియో వెబ్సైట్ ద్వారా ప్రకటించింది. ఇవికాకుండా, 99 రుపాయలకే 90 రోజులు 3 నెలల షిమారు సబ్ స్క్రిప్షన్ పొందే వీలుంది. అలాగే, కేవలం రూ.149 రూపాయల చెల్లించడం ద్వారా వన్ టైం స్క్రీన్ రీప్లేసెమెంట్ గ్యారెంటీని కూడా అఫర్ చేస్తోంది . అయితే, ఈ లాభన్నిటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రతినెలా రూ.249 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :