జియో అప్ కమింగ్ 4G స్మార్ట్ఫోన్ వివరాలు లీక్

Updated on 11-Oct-2020
HIGHLIGHTS

జియో తన తక్కువ ధర గల 4 జి స్మార్ట్ఫోన్ లను విడుదల చేయడానికి సిద్దమైంది.

జియో ఫోన్ గురించిన స్పెక్స్ ఇప్పుడు ఆన్లైన్లో లీక్ అయ్యాయి.

Jio Orbic Phone (RC545L) గూగుల్ ప్లే కన్సోల్లో గుర్తించబడింది.

మీరు తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే మీ సెర్చింగ్ త్వరలోనే పూర్తవుతుంది. ఎందుకంటే, అతి త్వరలోనే రిలయన్స్ జియో తన తక్కువ ధర గల 4 జి స్మార్ట్‌ఫోన్ ‌లను విడుదల చేయడానికి సిద్దమైంది. రిలయన్స్ జియో నుండి వస్తున్న ఈ తక్కువ ధర గల 4 జి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ .4,000. రిలయన్స్ జియో యొక్క తక్కువ ధర 4 జి స్మార్ట్‌ఫోన్‌కు జియో ఆర్బిక్ ఫోన్ (RC545L) అని పేరు పెట్టారు. ఈ ఫోన్ గురించిన స్పెక్స్ ఇప్పుడు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఈ రోజు మనం లీకైన Jio Orbic Phone (RC545L) వివరాలను  తెలుసుకుందాం.

Jio Orbic Phone (RC545L) గూగుల్ ప్లే కన్సోల్‌లో గుర్తించబడింది. గూగుల్ ప్లే జాబితా జియో నుండి ఈ ఫోన్ యొక్క ఫీచర్ల గురించి సమాచారాన్ని ఇస్తుంది. ఈ జాబితా ప్రకారం, జియో యొక్క తక్కువ-ధర 4 జి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు రిలయన్స్ ఆర్బిక్ (ఆర్‌సి 545 ఎల్) అని పేరు పెట్టనున్నారు. గూగుల్ భాగస్వామ్యంతో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. ఆండ్రాయిడ్ గో స్మార్ట్‌ఫోన్ కోసం రూపొందించిన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ క్యూఎం 215 ప్రాసెసర్ ఈ ఫోన్‌కు లభిస్తుంది.

Jio Orbic Phone (RC545L)

ప్రాసెసర్ పరంగా ఈ ఫోన్‌ను ఆండ్రాయిడ్ గోతో లాంచ్ చేయవచ్చు. అంటే , ఈ ఫోన్‌లో 1GB కంటే ఎక్కువ RAM ఆశించకూడదు. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే HD + రిజల్యూషన్ తో వుంటుంది. ఈ ఫోన్‌ను ఆండ్రాయిడ్ 10 లేదా 11 తో లాంచ్ చేయవచ్చు. ఈ ఫోన్ 2020 డిసెంబర్ నాటికి భారతదేశంలో లాంచ్ అవుతుంది. జియో ఏడాదిలోపు రెండు కోట్ల స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు నివేదిక తెలిపింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :