జియో తన 5G స్మార్ట్‌ఫోన్ ను రూ. 3,000 కంటే తక్కువ ధరకే తెస్తోందా?

HIGHLIGHTS

jio 5g స్మార్ట్ఫోన్ ను తక్కువ ధరలో ప్రవేశపెట్టాలని jio ప్లాన్ చేస్తోందా?

రిలయన్స్ జియో 5G స్మార్ట్ ఫోన్ అంచనా ధరను కూడా ప్రకటించడం విశేషం.

jio 5g స్మార్ట్ఫోన్ ను రూ.3,000 కంటే తక్కువ ధరలో

రిలయన్స్ జియో భారత దేశంలోని 2G వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని 4G స్మార్ట్ ఫోన్ ని తయారుచేస్తునట్లు ఇటీవల అనేక రూమర్లు మరియు వార్తాలను చూశాము. అయితే, ఇప్పుడు ఏకంగా 5G టెక్నాలజీతో ఒక స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నట్లు రూమర్లు మరియు వార్తాలను ఆన్లైన్ లో చూస్తున్నాము. అంతేకాదు, త్వరలో తీసుకురానున్నట్లు చెబుతున్న ఈ రిలయన్స్ జియో 5G స్మార్ట్ ఫోన్ అంచనా ధరను కూడా ప్రకటించడం విశేషం. మరి దీనికి సంభందించి అన్ని వివరాలను చూద్దామా..!

ముందుగా, ఈ విషయాన్ని ET Telecom ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారం, త్వరలోనే జియో సంస్థ 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చెయ్యవచ్చని, ఈ జియో 5G స్మార్ట్ ఫోన్ భారతీయ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని ధరను మాత్రం కేవలం 2,500 నుండి 3,000 రుపాయల పరిధిలో ఉంచవచ్చని తెలిపింది. అంతేకాదు, ఈ విషయాన్ని జియో సంస్థకి చెందిన ఒక ప్రముఖ అధికారి బయటపెట్టినట్లు తెలిపింది.

అయితే, ఈ విషయాన్ని గురించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు ET టెలికం పంపిన ఇమెయిల్ కు ఎటువంటి రిప్లై రానట్లు కూడా తెలిపింది. అలాగే, జిఓ కి సంబంధించిన వెబ్ సైట్, యాప్ లేదా మరేదైనా మాధ్యమం నుండి కూడా జియో 5G స్మార్ట్ ఫోన్ గురించి జియో అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు. కాబట్టి, జియో అధికారికంగా ప్రకటించే వరకూ జియో 5G స్మార్ట్ ఫోన్ గురించి తెలియదు.

వాస్తవానికి, ప్రస్తుత మార్కెట్లో ఒక 5G స్మార్ట్ ఫోన్ కొనాలంటే, దాదాపుగా 30,000 కంటే ఎక్కవ డబ్బునే ఖర్చు చేయాల్సి వస్తుంది.

Source:

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :