జియో సంస్థ డిసెంబర్ నెలలో అతితక్కువ ధరకే ఆండ్రాయిడ్ ఫోన్‌ లాంచ్ చేయవచ్చు

HIGHLIGHTS

రిలయన్స్ జియో చౌకైన 4 జి స్మార్ట్‌ఫోన్‌ లను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది

చౌకైన 4 జి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ సుమారు 4000 రూపాయల ధరలో తేవడానికి చూస్తోంది

జియో యొక్క చౌకైన 4 జి స్మార్ట్‌ఫోన్‌ను Jio Orbic phone (RC545L) అని ప్రకటించవచ్చని అంచనా వేస్తున్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లో తయారు చేయబోయే 100 మిలియన్ల చవక ధర జియో స్మార్ట్ ఫోన్ల తయారీని అవుట్ ‌సోర్స్ చేయాలని చూస్తోందని బిజినెస్ స్టాండర్డ్ వార్తాపత్రిక పేర్కొంది. మంచి డేటా ప్యాక్‌లతో కూడిన ఈ జియో స్మార్ట్ ఫోన్‌లను 2020 డిసెంబర్‌లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేయవచ్చని ఈ వార్తాపత్రిక బుధవారం నివేదించింది.

రిలయన్స్ జియో చౌకైన 4 జి స్మార్ట్‌ఫోన్‌ లను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా, డేటాను చవక ధరకే మార్కెట్లోకి తెచ్చిన ఈ జియో, ఈసారి  సంస్థ నుండి  చౌకైన 4 జి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ సుమారు 4000 రూపాయల ధరలో తేవడానికి చూస్తోంది. రిలయన్స్ జియో ఇటీవలే గూగుల్‌తో కలిసి ఒప్పందం చేసినప్పటి నుండి కస్టమర్లు జియో కొత్త ఫోన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, జియో లేదా గూగుల్ ఇంకా ఫోన్ గురించి ఏమీ చెప్పలేదు.

అలాగే, రిలయన్స్ జియో ఈ ఏడాది డిసెంబర్‌లో జియో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయవచ్చని కొద్ది రోజుల క్రితం వచ్చిన ఒక నివేదిక పేర్కొంది. రిలయన్స్ జియో యొక్క కొత్త ఫోన్ పేరు ఇప్పటికే ప్రకటించబడింది. రిలయన్స్ జియో యొక్క చౌకైన 4 జి స్మార్ట్‌ఫోన్‌ను Jio Orbic phone (RC545L) అని ప్రకటించవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ఫోన్ గురించి తెలుసుకుందాం …

జియో ఆర్బిక్ ఫోన్ (RC545L) గూగుల్ ప్లే కన్సోల్‌లో జాబితా చేయబడింది. గూగుల్ ప్లే జాబితా జియో నుండి ఈ ఫోన్ యొక్క ఫీచర్ల గురించి కూడా సమాచారం ఇస్తుంది. ఈ జాబితా ప్రకారం, జియో యొక్క చౌకైన 4 జి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు జియో ఆర్బిక్ ఫోన్ (ఆర్‌సి 455 ఎల్) అని పేరు పెట్టనున్నారు. కాబట్టి కంపెనీ మరోసారి తమ ఆర్బిక్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ను గూగుల్ ద్వారా లాంచ్ చేయనున్నారు. ఆండ్రాయిడ్ గో స్మార్ట్‌ఫోన్‌ల కోసం రూపొందించిన క్వాల్‌కామ్ యొక్క స్నాప్‌డ్రాగన్ QM215 ప్రాసెసర్ ఈ ఫోన్‌ ని నడిపిస్తుంది.

Android Go తో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది

ప్రాసెసర్ పరంగా, ఈ ఫోన్‌ను ఆండ్రాయిడ్ గోతో లాంచ్ చేయవచ్చు. అటువంటి పరిస్థితిలో ఈ ఫోన్‌లో 1GB RAM కంటే ఎక్కువ ర్యామ్ ఆశించలేము. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే  HD + రిజల్యూషన్‌లో ఉంటుంది. ఈ ఫోన్‌ను ఆండ్రాయిడ్ 10 లేదా 11 తో లాంచ్ చేయవచ్చు. ఈ ఫోన్‌ను 2020 డిసెంబర్ నాటికి భారతదేశంలో లాంచ్ చేయవచ్చు. ఏడాదిలోపు జియో రెండు కోట్ల స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువస్తుందని నివేదిక పేర్కొంది.

Note: పైన చూపిన చిత్రం ఊహాజనిత నమూనా చిత్రం మాత్రమే     

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :