Jio నుండి మరొక గుడ్ న్యూస్ : కేవలం ఒక్క రీఛార్జ్ రేటుకే Jio Phone 5

HIGHLIGHTS

Jio Phone 5 మొదట వచ్చిన Jio Phone కంటే చాలా తక్కువ ధరకు వస్తుందని చెప్పబడుతోంది.

కొత్త జియో ఫోన్ మోడల్ Jio Phone 3 స్థానంలో Jio Phone 5 ను సరసమైన మొబైల్ ఫోన్ ‌గా మార్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Jio Phone 5 ను చాలా చౌకగా మరియు సరసమైన ఫోన్ ‌గా మార్కెట్లో లాంచ్ చేయవచ్చని సందేహం లేకుండా చెప్పవచ్చు.

ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం, రిలయన్స్ జియో రూపొందించిన జియో ఫోన్ యొక్క కొత్త వెర్షన్ పైన పని తీవ్రంగా జరుగుతోంది. ఈ కొత్త జియో ఫోన్ మోడల్‌ను రిలయన్స్ జియో ఒరిజినల్ మోడల్ కంటే తక్కువ ధరకు లాంచ్ చేయవచ్చని నమ్మకంగా తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ ధర విషయానికి వస్తే, జియో ఫోన్ 5 గా తీసుకురానునాట్లు చెబుతున్న, ఈ కొత్త డివైస్ కేవలం రూ .399 రూపాయలకే ఆఫర్ చెయ్యవచ్చని అంచనావేస్తున్నారు.

అయితే, పాత, ఒరిజినల్ జియో ఫోన్ గురించి ఒకసారి గుర్తుచేసుకుంటే, ఈ మొబైల్ ఫోన్‌ ను LTE సర్వీస్ తో రూ .999 ధరకు అందించినట్లు మనకు తెలుసు. అయితే, జియో ఫోన్ 2 ని తీసుకొచ్చిన తరువాత, ఈ ఫోన్ కేవలం 699 రూపాయల రేటుకే అమ్మడువుతోంది . అయితే, ఇప్పుడు కొత్త జియో ఫోన్ మోడల్ Jio Phone 3 స్థానంలో Jio Phone 5 ను సరసమైన మొబైల్ ఫోన్ ‌గా మార్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

91 మొబైల్స్ నివేదికలో, జియో సంస్థ  ఈ Jio Phone 5 కోసం విస్తృతంగా పనిచేస్తున్నట్లు చెప్పబడింది. అయితే, ఇది స్మార్ట్ ఫోన్ ఫోన్ కాదని, ఇది కేవలం ఫీచర్ ఫోన్ మాత్రమే అవుతుందని అర్ధమవుతోంది. అంతేకాదు, ఒరిజినల్ Jio Phone కంటే  రానున్న ఈ Jio Phone 5 తక్కువ మోడల్ అవుతుందనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అందుకే, Jio Phone 5 మొదట వచ్చిన Jio Phone కంటే చాలా తక్కువ ధరకు వస్తుందని చెప్పబడుతోంది. 

ఈ నివేదిక నుండి Jio Phone 5 Price విషయానికి వస్తే, రూ .399 ప్రారంభ ధరకు అందించవచ్చని కూడా పేర్కొంటోంది. అంటే Jio Phone 5 ను చాలా చౌకగా మరియు సరసమైన ఫోన్ ‌గా మార్కెట్లో లాంచ్ చేయవచ్చని సందేహం లేకుండా చెప్పవచ్చు. ఇది కాకుండా, మీరు ఈ పరికరంలో 4G LTE కనెక్టివిటీతో కూడా ఉండవచ్చు.

Jio Phone 5 ఫెచర్స్

Jio Phone 5 ను 4 జి LTE తో లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు, దీనికి తోడు మీరు KaiOS తో మాత్రమే ఈ ఫోన్ వస్తుంది . ఈ మొబైల్ ఫోన్ ‌లో, అంటే Jio Phone 5 లో , ప్రీ లోడెడ్ బ్రౌజర్ ఇన్ ‌స్టాల్స్ ను పొందవచ్చు. అంటే, ఈ Jio Phone 5 ‌లో మీరు ముందే లోడ్ చేసిన వాట్సాప్, గూగుల్, ఫేస్ ‌బుక్ మరియు ఇతర యాప్‌ లను అందుకుంటారని అర్ధం చేసుకోవచ్చు .

ఈ నివేదికలో, Jio Phone 5 యొక్క వినియోగదారులు Jio టూ Jio నంబర్‌ పై కాల్స్ కోసం ఛార్జీలు వసూలు చేయబోవడం లేదు, అంటే ఈ ఫోన్ ‌తో మీకు ఉచితంగా కాల్ వస్తుంది. అయితే ఇంటర్నెట్ మొదలైన వాటి కోసం మీరు ప్రత్యేక ఇంటర్నెట్ ప్యాక్ పొందాలి. జియో నుండి వచ్చిన జియో ఫోన్ ప్లాన్ ‌ను జియో ఫోన్ లైట్ జియో ఫోన్ లైట్ వినియోగదారులలు మాత్రమే ఉపయోగించవచ్చు. అయితే, సంస్థ కొత్త ప్రణాళికలతో ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :