టెలికం రంగంలో సంచనాలు సృష్టించడంలో ముందుగా జియో పేరును చెప్పొచ్చు. అతితక్కువ ధరకే ఉన్నతమైన 4G సేవలను అందిస్తున్న టెలికం సంస్థగా జియో పేరును ప్రకటించడంలో ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదు. అయితే, ఇప్పుడు అమర్నాథ్ యాత్రికుల కోసం కేవలం రూ.102 రూపాయల ప్లాన్ను విడుదల చేసి మరికసారి అందరిని ఆశ్చర్యపరిచారు.
ఈ 102 రుపాయల ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ప్రయోజనాల వివరాల్లోకి వెళితే, ఈ ప్లాన్ కేవలం జమ్మూ& కాశ్మిర్ లో మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే, ఇది కేవలం అమర్నాథ్ యాత్ర చేసే భక్తుల కోసం ప్రవేశపెట్టపడింది. దీనితో, అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటుగా రోజుకు 100 SMS లను అందుకుంటారు. అలాగే, వీటితో పాటుగా డైలీ 500MB హై స్పీడ్ Data కూడా అఫర్ చేస్తోంది. అయితే, ఇది కేవలం ఒక వరం చెల్లుబాటుతో వస్తుంది. అంటే, ఇది 7 రోజుల అన్లిమిటెడ్ లాభాలను అందిస్తుంది.
వాస్తవానికి, అమర్నాథ్ యాత్ర సమయంలో జమ్మూ& కాశ్మిర్ లో ఇతర రాష్ట్రాల యొక్క మొబైల్ కనెక్షన్ పైన ఎన్నో ఆంక్షలు ఉన్న కారణంగా, యాత్రికులు ఇబ్బంది పడుతుంటారు. అయితే, జియో ఈ సమస్యకు పరిస్కారంగా ఈ ప్లాన్ను అందించింది. ఈ అమర్నాథ్ యాత్ర సమయంలో ఎన్నో ఔట్ లెట్లలో లోకల్ జియో ప్రీపెయిడ్ కనెక్షన్ అందిస్తోంది. కాబట్టి, లోకల్ కనెక్షన్ తీసుకొని సులభంగా ఈ రీఛార్జ్ చేసుకోవచ్చు.