Jio గుడ్ న్యూస్..JioPhone Next లాంచ్ డేట్ ఫిక్స్..!

HIGHLIGHTS

JioPhone Next లాంచ్ డేట్ ఎట్టకేలకు ఫిక్స్

జియోఫోన్ నెక్స్ట్ ఫోన్ దీపావళి పండుగకు విడుదలకానుంది

Google CEO సుందర్ పిచాయ్ Q3 అర్నింగ్ కాల్‌లో వెల్లడించారు

చాలా కాలంగా ఉరిస్తూవచ్చిన JioPhone Next లాంచ్ డేట్ ఎట్టకేలకు ఫిక్స్ చేసింది. జియోఫోన్ నెక్స్ట్ ఫోన్ ను ఈ దీపావళి పండుగకు విడుదల చేస్తున్నట్లు జియో ప్రకటించింది మరియు ఈ ఫోన్ యొక్క ముఖ్యమైన ఫీచర్లను కూడా వెల్లడించింది. ఇది మాత్రమే కాదు, Google CEO సుందర్ పిచాయ్ Q3 అర్నింగ్ కాల్‌లో వెల్లడించారు. అంటే, ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఈ దీపావళికి అమ్మకాలను సాగిస్తుందని ఆశించవచ్చు.

ఇక గతంలో వచ్చిన అనేక రూమర్ల ద్వారా JioPhone Next ధర రూ. 3,499 కావచ్చని వెల్లడించారు. ఇప్పుడు ఈ ఫోన్ అమ్మకం నవంబర్ నెలలో ప్రారంభమవుతుందని ఊహిస్తున్నారు. ముందుగా వచ్చిన లీక్స్ కూడా ఈ ఫోన్ ధర రూ.3,500 నుండి రూ.4,500 మధ్యస్థంగా ఉండవచ్చని సూచించాయి.

JioPhone Next: స్పెక్స్

ఇక ఫీచర్ల విషయానికి వస్తే, జియోఫోన్ నెక్స్ట్ గురించి ఆన్లైన్లో వచ్చిన అనేకమైన లీక్స్ ద్వారా ఈ ఫోన్ 5.5-అంగుళాల HD డిస్ప్లే కలిగి ఉంటుంది మరియు  Qualcomm QM215 చిప్‌సెట్‌తో రావచ్చు. అలాగే, ఈ ఫోన్ 2GB లేదా 3GB RAM తో రావచ్చు మరియు ఇది 16GB లేదా 32GB eMMC 4.5 ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :