పెద్ద డిస్ప్లే, పెద్ద బ్యాటరీ మరియు ఆండ్రోయిడ్ 9 తో కేవలం రూ.3,999 ధరకే స్మార్ట్ ఫోన్

Updated on 07-Jan-2020
HIGHLIGHTS

ఇది తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం తో సహా 12 భారతీయ భాషల సపోర్టుతో వస్తుంది.

అన్ని ప్రత్యేకతలు కలిగిన ఒక స్మార్ట్ ఫోన్ను కేవలం కేవలం రూ.3,999 రుపాయకే సొతం చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని itel సంస్థ అందించింది. నిన్న, itel సంస్థ   ఈ ధరలో మంచి స్పెక్స్ తో, తన A25 మొబైల్ ఫోన్ను ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్, కేవలం రూ. 3,999 ధరలో పెద్ద బ్యాటరీ, పెద్ద డిస్ప్లే మరియు మరిన్ని ట్రెండీ ఫీచర్లతో విడుదలయ్యింది. అలాగే, ఈ స్మార్ట్ ఫోన్ ఈ రోజు నుండి భారతదేశమంతటా ఆఫ్ లైన్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా, ఈ మొబైల్ ఫోన్ "Google Lens" కలిగి ఉంటుంది.    

Itel A25 ధర

Itel A25 – 1GB + 16GB – ధర : Rs.3,999

Itel A25 : ప్రత్యేకతలు

ఈ Itel A25 ఫోన్, ఒక 5- అంగుళాల HD ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో అందించింది. అలాగే, ఇది ఒక 1.4 GHz వరకు క్లాక్ స్పీడ్ అందించగల క్వాడ్  కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ప్రాసెసరుకు జతగా, 1GB ర్యామ్ మరియు 16 GB స్టోరేజి తో వస్తుంది.అలాగే, ఒక డేడికేటెడ్ SD కార్డు సహాయంతో 32GB వరకూ మేమెవరిని పెంచుకోవచ్చు. అధనంగా, Android 9 Pie (Go Edition) OS తో లాంచ్ చేశారు. ఇది గ్రేడియంట్ బ్యాక్ ఫినిష్ తో వస్తుంది మరియు గ్రేడియం బ్లూ, సి బ్లూ మరియు గ్రేడియంట్ పర్పల్ వాటి మూడు ముచ్చటైన తంగుల ఎంపికలతో వస్తుంది. 

ఇక ఈ ఫోన్ యొక్క కెమేరా విభాగానికి వస్తే, ఇది ఒక 5MP సింగిల్ రియర్ కేమేరా మరియు ఫ్లాష్ తో అందించబడింది. ముందుభాగంలో సెల్ఫీ కోసం, ఈ ఫోన్‌లో 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ ఒక 3,020 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది మరియు ఇది తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం తో సహా 12 భారతీయ భాషల సపోర్టుతో వస్తుంది. ఈ కెమేరా, మంచి ఫోతులను తీసుకునేందుకు వీలుగా Google Lens తో పాటుగా వస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, ఇది డ్యూయల్ 4G VoLTE/ViLTE సపోర్టుతో వస్తుంది.    

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :