షావోమి రెడ్మి నోట్ 7 ప్రో త్వరలోనే రానుందా ? ఇది చైనా 3C వెబ్సైట్ లో కనిపించింది.

HIGHLIGHTS

M1901F7BE మోడల్ నంబరు గల ఒక షావోమి ఫోన్ చైనా యొక్క 3C ధ్రువీకరణ పొందింది. ఈ ఫోన్ని రెడీమి నోట్ 7 ప్రో గా భావిస్తున్నారు.

షావోమి రెడ్మి నోట్ 7 ప్రో త్వరలోనే రానుందా ? ఇది చైనా 3C వెబ్సైట్ లో కనిపించింది.

షావోమి రెడ్మి నోట్ 7 స్మార్ట్ ఫోన్,  చైనాలో మంచి అమ్మకాలను సాధించింది మరియు మంచి ఆదరణ కొద పొందింది. ఇటీవలే ప్రారంభించినప్పటి నుంచి మూడు వారాల పాటు జరిగిన అమ్మకాలు, 1 మిలియన్(10లక్షల)  యూనిట్లకు మించిపోయినట్లు కంపెనీ యొక్క CEO ప్రకటించారు. అయినప్పటికీ, త్వరలోనే రెడ్మి నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ను ప్రారంభించనున్నట్లు భావిస్తున్నారు. ఎందుకంటే,  చైనా కంపల్సరీ సర్టిఫికెట్ (3C) వెబ్సైటులో ఇటీవలే దర్శనమిచినట్లు, చైనాలో  అధికారిక ప్రకటన దీనికి ఊతమిచ్చింది . NashvilleChatterClass ప్రకారం,  M1901F7BE మోడల్ సంఖ్యతో ఒక కొత్త Xiaomi ఫోన్ 3C ద్వారా ఆమోదించబడింది. ఆమోదం పొందిన ఈ ఫోన్ రెడ్మి నోట్ 7 ప్రో కావచ్చని భావిస్తున్నారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ నివేదిక ప్రకారం, రెడ్మి నోట్ 7  చైనాలో M1901F7T, M1901F7E మరియు M1901F7C మోడల్ సంఖ్యలతో ఉన్నాయి. ఈ కొత్త పరికరం 3C వెబ్సైట్లో దాని మోడల్ నంబర్  నోట్ 7 ప్రో గా చెప్పబడింది,  రెడ్మీ నోట్ 7 ఫోన్ల యొక్క ప్రారంభ సీరియల్ తో  ఇది సరిపోతుంది. అదనంగా, MDW-08-ES షావోమి ఛార్జరుతో ఇది నమోదు చేయబడింది, ఇది 18W వరకు వేగవంతమైన ఛార్జింగ్ అందిస్తుంది, ఈ కొత్త హ్యాండ్ సెట్ నిజంగా మంచి లక్షణాలతో కూడిన రెడ్మి నోట్ 7 ప్రో అయ్యిఉండవచ్చనే ఊహాగానాలకు మరింతగా నిజంచేసేలా అనిపిస్తుంది. అంతేకాకుండా, మోడల్ సంఖ్యలు M1902F1A మరియు M1902F1T కూడా ఈ సర్టిఫికేషన్ వెబ్సైట్లో కనిపించాయి, ఇవి రాబోయే Xiaomi Mi 9 స్మార్ట్ ఫోనుకు చెందినవి. ఈ డివైజ్ ఒక 27W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో జాబితా చేయబడింది.

రెడ్మి యొక్క CEO అయిన, లూ వేయిబింగ్ యొక్క ఇటీవలి వీబోలో పోస్ట్ అయిన రెడ్మి నోట్ 7 ప్రో, ఫిబ్రవరి 20 న విడుదల చేయనున్నMi 9 తర్వాత ప్రకటచేనున్నట్లు తెలుస్తోంది. వెయిబింగ్ పోస్ట్, నేరుగా అనువదించినపుడు, Pro, "డార్క్'  'వైన్' ఆతరువాత 'ప్రో " అనిచేబుతోంది. ఇక్కడ 'వైన్ ' అనేది, మి ​​9 స్మార్ట్ ఫోనుకు ఒక సూచనగా చెప్పబడుతున్నాయి, ఇక ప్రో అనేది నోట్ 7 ప్రో గురించి చ్పియినట్లు అనిపిస్తోంది. అంటే, త్వరలో Mi 9 విడుదలకానునట్లు, ఆతరువాత రెడ్మి నోట్ 7 ప్రో కూడా రానున్నట్లు చెప్పకనే చెబుతోంది. షావోమి దాని రెడ్మి నోట్ 7 స్మార్ట్ ఫోన్ను భారతదేశంలో ఫిబ్రవరి 28 న విడుదల చేయనున్నది. అలాగే, రెడ్మి నోట్ 7 ప్రో మరియు రెడ్మి గో స్మార్ట్ ఫోన్లను కూడా ఈ ఫోనుతో పాటుగా ప్రారంభించనున్నట్లు భావిస్తున్నారు. సోమవారం, ఫిబ్రవరి 28 న భారతదేశంలో విడుదల చేయనున్న కార్యక్రమం కంటే ముందుగానే,  చైనాలో ఈ రెడ్మి నోట్ 7 ప్రో ని ప్రకటించవచ్చు.      

 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo