iQOO Z7 Pro 5G పైన ధమాకా ఆఫర్ ప్రకటించిన అమేజాన్.!

HIGHLIGHTS

iQOO Z7 Pro 5G పైన ధమాకా ఆఫర్ ప్రకటించింది అమేజాన్

బడ్జెట్ ధరలో 3D Curved AMOLED డిస్ప్లే ఫోన్

ఈరోజు అమేజాన్ ఆఫర్ తో మరింత తక్కువ బడ్జెట్ లోనే ఈ ఫోన్ లభిస్తుంది

ఇండియన్ మార్కెట్ లో బడ్జెట్ ధరలో భారీ ఫీచర్లతో ఐకూ లాంచ్ చేసిన iQOO Z7 Pro 5G పైన ధమాకా ఆఫర్ ప్రకటించింది అమేజాన్. ఈ ఆఫర్ అందుకున్న తరువాత ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ మరింత తక్కువ ధరకే అందుకునే అవకాశాన్ని ఇచ్చింది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో 3D Curved AMOLED డిస్ప్లే కంపెనీ తీసుకురాగా, ఈరోజు అమేజాన్ ఆఫర్ తో మరింత తక్కువ బడ్జెట్ లోనే ఈ ఫోన్ లభిస్తుంది.

iQOO Z7 Pro 5G offer

ఐకూ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఐకూ జెడ్7 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ నాటి నుండి ఎటువంటి మార్పులు లేకుండా ఒకే ధరతో కొనసాగుతోంది. అయితే, ఈరోజు 2024 న్యూ ఇయర్ సందర్భంగా అమేజాన్ ఈ ఫోన్ పైన రూ. 2,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది.

ఐకూ జెడ్7 ప్రో స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ 8GB + 128GB వేరియంట్ రూ. 23,999 ధరతో మరియు 8GB + 256GB వేరియంట్ రూ. 24,999 ధరతో లిస్ట్ చెయ్యబడింది. ఈ ఫోన్ ను HDFC బ్యాంక్ మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here

Also Read : Tecno Pop 8 Up: ఆకట్టుకునే డిజైన్ తో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్న టెక్నో.!

ఐకూ జెడ్7 ప్రో స్పెక్స్ & ఫీచర్స్

ఐకూ జెడ్7 ప్రో స్మార్ట్ ఫోన్ MediaTek యొక్క బడ్జెట్ ఫాస్ట్ ప్రోసెసర్ Dimesity 7200 5G తో పని చేస్తుంది. అలాగే, ఈ ఫోన్ ను మరింత వేగంగా ఉంచడానికి వీలుగా 8GB RAM + 8GB ఎక్స్ టెండెడ్ ర్యామ్ 3.0 ఫీచర్ తో టోటల్ 16GB వరకూ ర్యామ్ ని ఆఫర్ చేస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 256GB హెవీ స్టోరేజ్ కూడా వుంది.

ఐకూ జెడ్7 ప్రో స్పెక్స్ & ఫీచర్స్

ఈ ఫోన్ 3డి కర్వ్డ్ ఆమోలెడ్ డిస్ప్లేని 120 Hz రిఫ్రెష్ రేట్ మరియు 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 7.36mm మందంతో చాలా సన్నగా మరియు 175 గ్రాముల బరువుతో చాలా లైట్ గా స్టైలిష్ గా ఉంటుంది. ఈ ఫోన్ లో Aura Lite జత కలిగిన 64MP OIS డ్యూయల్ కెమేరా సెటప్ వుంది. ఈ కెమేరాతో గొప్ప ఫోటోలను మరియు 4K వీడియోలను రికార్డ్ చేసే వీలుంది.

ఈ ఫోన్ లో 66W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ కూడా వుంది. ఈ ఫోన్ మంచి రివ్యూలను మరియు రేటింగ్ ను అందుకుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :