iQOO Z6 Pro: HDR10+ డిస్ప్లే మరియు 66W ఫాస్ట్ ఛార్జ్ వంటి భారీ ప్రత్యేకతలతో వచ్చింది!

HIGHLIGHTS

iQOO Z6 Pro ఇండియాలో విడుదల

66W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది

ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778G 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది

iQOO ఇటీవల ప్రకటించిన బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ ఐకూ Z6 యొక్క Pro వెర్షన్ iQOO Z6 Pro ను ఇండియాలో ఈరోజు విడుదల చేసింది. ఈ ఐకూ Z6 ప్రో స్మార్ట్ ఫోన్ Z స్నాప్ డ్రాగన్ 778G ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు 66W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది. ఐకూ కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ ను మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. మరి ఈ లేటెస్ట్ ఐకూ 5G స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలతో పాటుగా ధర మరియు అఫర్లను గురించి కూడా తెలుసుకుందామా.      

iQOO Z6 Pro: ధర

ఐకూ జెడ్ 6 ప్రో స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ను రూ.23,999 రూపాయల ధరతో ప్రకటించింది. అలాగే, 8GB+128GB వేరియంట్ ధర రూ.24,999 మరియు 12GB+256GB వేరియంట్ ధర రూ.28,999 గా ప్రకటించింది. లిమిటెడ్ పిరియడ్ అఫర్ లో భాగంగా Amazon Summer sale నుండి 1000 రూపాయల డిస్కౌంట్ ధరకు పొందవచ్చు.

iQOO Z6 Pro: స్పెక్స్

ఈ ఐకూ జెడ్ 6 ప్రో 5G స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగిన 6.44 ఇంచ్ పరిమాణం కలిగిన FHD+ రిజల్యూషన్ AMOLED డిస్ప్లే ని కలిగి వుంది.ఈ డిస్ప్లే 1300 పీక్ బ్రైట్నెస్ అందించ గలదు మరియు HDR 10+ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778G 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా గరిష్టంగా 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది మరియు 4GB వరకూ ఎక్స్ టెండెడ్ ర్యామ్ సపోర్ట్ కూడా వుంది. అలాగే, ఫోన్ ను నిరంతరం చల్లగా ఉంచడానికి 2100 mm² వేపర్ ఛాంబర్ ను కూడా కలిగి ఉంటుంది.

ఆప్టిక్స్ విభాగంలో, ఈ లేటెస్ట్ ఐ కూ 5G ఫోన్ వెనుక డ్యూయల్ ట్రిపుల్ కెమెరా సెటప్పు ఉంది. ఈ ట్రిపుల్ కెమెరాలో 64MP ప్రధాన కెమెరాకి జతగా అల్ట్రా వైడ్ కెమెరా మరియు 4cm మ్యాక్రో సెన్సార్ తో వస్తుంది. ముందుభాగంలో, సెల్ఫీ కెమెరాని సెల్ఫీల కోసం అందించింది. ఈ 5G స్మార్ట్ ఫోన్ లో 4,700mAh బ్యాటరీని 66W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. మొబైల్ గేమర్‌ లను ఆకర్షించడానికి, Z6 ప్రో 4D లీనియర్ వైబ్రేషన్ మోటార్ ని జతచేసింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :