iQOO Z11x 5G india launch date and features confirmed
iQOO Z11x 5G స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ కోసం గత వారం నుంచి టీజింగ్ మొదలుపెట్టిన ఐకూ, ఇప్పుడు ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు కూడా కన్ఫర్మ్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను హెవీ బ్యాటరీ మరియు ఫాస్ట్ ప్రోసెసర్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయ్యే డేట్ మరియు ఈ ఫోన్ గురించి ఐకూ వెల్లడించిన కీలక ఫీచర్లు తెలుసుకోండి.
ఐకూ జెడ్ 11x స్మార్ట్ ఫోన్ ను మార్చి 12వ తేదీ ఇండియాలో విడుదల చేస్తున్నట్లు డేట్ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అంటే, ఈ ఫోన్ లాంచ్ తర్వాత అమెజాన్ నుంచి ప్రత్యేకంగా సేల్ అవుతుంది. అంతేకాదు, అమెజాన్ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది.
ఐకూ జెడ్ 11x స్మార్ట్ ఫోన్ ఈ సెగ్మెంట్ లో అత్యంత వేగవంతమైన చిప్ సెట్ తో లాంచ్ అవుతున్నట్లు ఐకూ తెలిపింది. అదేమిటంటే, ఈ ఫోన్ ను మీడియాటెక్ యొక్క లేటెస్ట్ చిప్ సెట్ Dimensity 7400 Turbo తో లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఇది 10 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ అందించే చిప్ సెట్ మరియు మంచి AI సత్తా కలిగి ఉంటుంది. ఈ చిప్ సెట్ తో ఈ ఫోన్ చాలా గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుందని ఐకూ చెబుతోంది.
బ్యాటరీ, ఈ ఫోన్ కలిగిన బ్యాటరీ గురించి కూడా కంపెనీ చాలా గొప్పగా చెబుతోంది. ఎందుకంటే, ఈ స్మార్ట్ ఫోన్ ను 7200 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కలిగిన బ్యాటరీ వేగవంతమైన ఫాస్ట్ ఛార్జ్ మరియు ఇతర చార్జింగ్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. అవేమిటంటే, ఈ ఫోన్ 44W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ మరియు వేగవంతమైన రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన బ్యాటరీతో ఏకంగా 40 గంటల వీడియో రికార్డింగ్ ఆఫర్ చేస్తుందని ఐకూ తెలిపింది.
Also Read: Boat 5.1 Dolby Atmos సౌండ్ బార్ భారీ ఆఫర్స్ తో కేవలం 10 వేల ధరలోనే లభిస్తోంది.!
ఇక ఈ ఫోన్ ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ ను రెండు కలర్ వేరియంట్స్ లో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ బ్యాటరీ 6 సంవత్సరాల లాంగ్ లైఫ్ తో వస్తుందని కూడా ఐకూ తెలిపింది.