iQOO Z10 5G: స్నాప్ డ్రాగన్ కొత్త చిప్ సెట్ మరియు 24GB ర్యామ్ తో లాంచ్ అవుతుంది.!

Updated on 07-Apr-2025
HIGHLIGHTS

iQOO Z10 5G స్మార్ట్ ఫోన్ మరో మూడు రోజుల్లో మార్కెట్లో లాంచ్ అవుతుంది

ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ ఒక్కటిగా కంపెనీ బయటపెట్టింది

క్వాల్కామ్ చిప్ సెట్ మరియు లాంగ్ బ్యాటరీతో లాంచ్ అవుతుందని క్లియర్ అయ్యింది

iQOO Z10 5G స్మార్ట్ ఫోన్ మరో మూడు రోజుల్లో మార్కెట్లో లాంచ్ అవుతుంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ ఒక్కటిగా కంపెనీ బయటపెట్టింది. ఐకూ ఇప్పటికే అందించిన వివరాల ప్రకారం, ఈ ఫోన్ చాలా సన్నని డిజైన్ తో పవర్ ఫుల్ క్వాల్కామ్ చిప్ సెట్ మరియు లాంగ్ బ్యాటరీతో లాంచ్ అవుతుందని క్లియర్ అయ్యింది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ లో 24GB భారీ ర్యామ్ మరియు భారీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటాయి.

iQOO Z10 5G: ఫీచర్స్

ఐకూ జెడ్ 10 5జి స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 11వ తేదీ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ కలిగివున్న చాలా కీలకమైన ఫీచర్స్ ఇప్పటికే వెల్లడించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7s Gen 3 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఈ చిప్ సెట్ కి జతగా 12GB ఫిజికల్ ర్యామ్ మరియు 12GB అదనపు ర్యామ్ తో కలిపి 24GB ర్యామ్ ఫీచర్ మరియు జతగా 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో డిస్ప్లే పరంగా గొప్పగా ఉంటుందిట. ఎందుకంటే, ఈ ఫోన్ ను 5000 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్నెస్ కలిగిన క్వాడ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ అవుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ ఈ సెగ్మెంట్ లో ఈ ఫీచర్ కలిగిన మొదటి ఫోన్ అవుతుందట. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో ఉంటుంది. అయితే, ఈ అంత సన్నగా ఉన్నా ఈ ఫోన్ అతిపెద్ద 7300 mAh బ్యాటరీ మరియు 90W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో లాంచ్ అవుతుంది.

ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్స్ లోకి వెళితే, ఈ ఫోన్ 50MP (OIS) Sony IMX882 మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ AI Camera పే ఫీచర్స్ మరియు AI సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 15 OS తో లాంచ్ అవుతుంది మరియు 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్స్ తో పాటు 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుంది.

Also Read: 10 వేల బడ్జెట్ ధరలో 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ తో వచ్చిన Lava Bold 5G ఫస్ట్ సేల్.!

ఈ ఫోన్ మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ MIL-STD 810H సర్టిఫికేషన్ తో కూడా ఉంటుంది. ఈ ఫోన్ స్టెల్లార్ బ్లాక్ మరియు గ్లేసియర్ సిల్వర్ రెండు కలర్ లలో లాంచ్ అవుతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :