iQOO Neo 10
iQOO Neo 10: ఐకూ చాలా కాలంగా టీజింగ్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ ఐకూ నియో 10 5జి స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఎట్టకేలకు విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను భారీ ఫీచర్స్ తో మిడ్ రేంజ్ ధరలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ డ్యూయల్ చిప్ పవర్ మరియి స్లీక్ డిజైన్ మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో ఐకూ అందించింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందామా.
ఐకూ నియో 10 5జి స్మార్ట్ ఫోన్ ను ఎం మొత్తం 4 వేరియంట్స్ లో లాంచ్ చేసింది. బేసిక్ 8GB +128GB వేరియంట్ రూ. 31,999 ధరతో, 8GB + 256GB వేరియంట్ ను రూ. 33,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 12GB + 256 వేరియంట్ ను రూ. 35,999 ధరతో మరియు హై ఎండ్ 16GB 512GB వేరియంట్ ను 40,999 ధరతో లాంచ్ చేసింది.
ఈ లేటెస్ట్ ఐకూ స్మార్ట్ ఫోన్ పై భారీ ఆఫర్లు కూడా ఐకూ ప్రకటించింది. ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లేదా రూ. 2,000 అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ అందించింది. అదే ఐకూ లేదా వివో డివైజెస్ అయితే ఏకంగా రూ. 4,000 రూపీల ఎక్స్ చేంజ్ బోనస్ అందుకోవచ్చని ప్రకటించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను 30 వేల కంటే తక్కువ ప్రారంభ ధరకే ఈ లభిస్తుంది.
జూన్ 2వ తేదీ నుంచి ఈ ఫోన్ ప్రీ బుక్ స్టార్ట్ అవుతుంది మరియు జూన్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ అమెజాన్ మరియు ఐకూ వెబ్సైట్ నుంచి సేల్ అవుతుంది.
ఐకూ ఈ స్మార్ట్ ఫోన్ ను చాలా స్లీక్ డిజైన్ తో అందించింది ఈ ఫోన్ సరికొత్త ఇన్ఫ్రెనో రెడ్ మరియు టైటానియం క్రోమ్ రెండు కలర్స్ లో వచ్చింది. ఈ ఫోన్ ను డ్యూయల్ చిప్ పవర్ తో ఐకూ అందించింది. ఇందులో క్వాల్కమ్ లేటెస్ట్ చిప్ సెట్ Snapdragon 8s Gen 4 మరియు ఐకూ సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ కూడా ఉంటుంది. అంతేకాదు, డ్యూయల్ చిప్ జతగా 12GB LPDDR5 ర్యామ్ మరియు 256GB (UFS 4.1) ఫాస్ట్ రెస్పాన్స్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో గేమింగ్ కోసం తగిన స్క్రీన్ ను కూడా ఐకూ అందించింది. నియో 10 స్మార్ట్ ఫోన్ లో ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన 6.67 ఇంచ్ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్, 5500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 1.5K రిజల్యూషన్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ కలిగిన సూపర్ రిజల్యూషన్ మరియు రిఫ్రెష్ రేట్ తో గొప్ప గేమింగ్ అందిస్తుందని ఐకూ టీ చెబుతోంది.
ఈ ఫోన్ లో వెనుక 50MP Sony OIS ప్రధాన కెమెరా మరియు అల్ట్రా వైడ్ కెమెరా కలిగి డ్యూయల్ రియర్ కెమెరా వుంది. అలాగే, ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 60FPS తో 4K UHD వీడియో రికార్డింగ్ మరియు AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సూపర్ నైట్ మోడ్ మరియు పోర్ట్రైట్ వంటి ప్రత్యేకమైన కెమెరా మోడ్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Jio HotStar ఉచితంగా అందించే జియో బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే.!
ఈ ఫోన్ లో 7000 mAh హెవీ బ్యాటరీ ని ఐకూ అందించింది. అంతేకాదు, ఈ బ్యాటరీని అత్యంత వేగంగా ఛార్జ్ చేసే 120W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా ఈ ఫోన్ లో అందించింది. ఈ ఫోన్ ను వేగంగా చల్లబరిచే 7000mm వేపర్ కూలింగ్ ఛాంబర్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ Funtouch సాఫ్ట్ వేర్ తో Android 15 OS పై నడుస్తుంది.