Iqoo neo 7 price cut in india: ఈ ఐకూ ఫోన్ పైన రూ. 2,000 తగ్గింపు ప్రకటించిన కంపెనీ.!

HIGHLIGHTS

iQOO Neo 7 పైన రూ. 2,000 తగ్గింపు ప్రకటించిన కంపెనీ

Amazon నుండి iQOO Neo 7 కొత్త రేట్ లతో లిస్టింగ్ చెయ్యబడింది

ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ ధర, ఆఫర్లు మరియు ఫీచర్లు ఏమిటో ఒక లుక్కేద్దామా

Iqoo neo 7 price cut in india: ఈ ఐకూ ఫోన్ పైన రూ. 2,000 తగ్గింపు ప్రకటించిన కంపెనీ.!

Iqoo neo 7 price cut in india:  iQOO బ్రాండ్ నుండి భారీ ఫీచర్స్ తో వచ్చిన iQOO Neo 7 పైన రూ. 2,000 తగ్గింపు ప్రకటించిన కంపెనీ. ఈ స్మార్ట్ ఫోన్ ను ఇప్పటికే కొత్త ధరతో కంపెనీ అధికారిక వెబ్సైట్ మరియు Amazon నుండి కొత్త రేట్ లతో లిస్టింగ్ చెయ్యబడింది. Neo 7 స్మార్ట్ ఫోన్ 4nm Processor, హై స్పీడ్ ఛార్జ్ టెక్, గేమింగ్ సపోర్ట్ పవర్ఫుల్ డిస్ప్లే వంటి చాలా ప్రత్యేకమైన ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ ధర, ఆఫర్లు మరియు ఫీచర్లు ఏమిటో ఒక లుక్కేద్దామా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

iQOO Neo 7 Price Cut

ఐకూ నియో 7 స్మార్ట్ ఫోన్ ను కంపెనీ రూ. 29,999 రూపాయల ప్రారంభ ధరతో ఇండియన్  మార్కెట్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ పైన రూ. 2,000 తగ్గింపును అందించడం ద్వారా ఈ ఫోన్ ను మరింత చవక ధరకే అఫర్ చేస్తోంది. ఈ ఫోన్ యొక్క స్టార్టింగ్ వేరియంట్ (8GB + 128GB) ఇప్పుడు రూ. 27,999 రూపాయలకే లభిస్తోంది. ఈ ఫోన్ యొక్క హై ఎండ్ వేరియంట్(12GB + 256GB) కూడా రూ. 2,000 తగ్గింపుతో రూ. 31,999 ధరకే లభిస్తోంది. BuyFrom Here

iQOO Neo 7 New Offers

ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లేదా డెబిట్ కార్డ్ తో ఫుల్ పేమెంట్ చేసి కొనే వారికి రూ. 1,000 అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. HDFC బ్యాంక్ కార్డ్స్ నాన్ EMI అఫర్ తో రూ. 1,000 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, Citibank క్రెడిట్ కార్డ్ EMI అఫర్ తో కొనే వారికి కూడా  రూ. 1,000 డిస్కౌంట్ అఫర్ వర్తిస్తుంది. Buy From Here

iQOO Neo 7 Specs

iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచ్ 120Hz AMOLED డిస్ప్లేని HDR 10+ సపోర్ట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ గరిష్టంగా 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో గొప్ప విజువల్స్ ను అందిగలదు. నియో 7  స్మార్ట్ ఫోన్ MediaTek Dimensity 8200 5G ప్రోసెసర్ తో పనిచేస్తుంది మరియు జతగా LPDDR5 8GB / 12GB RAM సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్ మంచి పెర్ఫార్మెన్స్ అదించాలదు మరియు హెవీ గేమింగ్ కు కూడా అనువైనది. 

ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ 120W Flash Charge సపోర్ట్ కలిగిన 5000 mAh  బ్యాటరీని కలిగి వుంది. Neo 7 5G ఫోన్ వెనుక 64MP OIS + 2MP (Bokeh) +2MP (Macro) సెన్సార్లు కలిగిన ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ ను కలిగి వుంది. ఈ ఫోన్ కెమేరా 4K Video Recording సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ Funtouch OS 13 సాఫ్ట్ వేర్ తో Android 13 OS పైన నడుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo