iQOO 9 Series నుండి మూడు స్మార్ట్ ఫోన్లు లాంచ్: ధర మరియు ఫీచర్లు ఇవే

HIGHLIGHTS

iQOO 9, iQOO 9 Pro మరియు iQOO 9 SE మూడు ఫోన్లను ప్రకటించింది

iQOO 9 Series నుండి కంపెనీ ఈరోజు మూడు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. ఈ 9 సిరీస్ లో iQOO 9, iQOO 9 Pro మరియు iQOO 9 SE మూడు ఫోన్లను ప్రకటించింది. ఈ మూడు ఫోన్లలో 9 SE స్మార్ట్ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ మరియు తక్కువ ధరలో వస్తుంది. అలాగే, iQOO 9 Pro హై ఎండ్ స్మార్ట్ ఫోన్ మరియు భారీ ఫీచర్లను కలిగివుంది. ఈ లేటెస్ట్ ఐకూ మొబైల్ ధర, ప్రీ ఆర్డర్స్, సేల్ మరియు ఆఫర్లను గురించి తెలుసుకుందామా.

iQOO 9 Series: ధర మరియు లభ్యత

iQOO 9 SE:

iQOO 9 SE స్మార్ట్ ఫోన్ ఈ సిరీస్ లో లభించే తక్కువ ధర ఫోన్ మరియు ఈ ఫోన్ యొక్క Pre-Order మార్చ్ 2 నుండి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ పైన 3,000 రూపాయల వరకూ ICICI బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ కూడా అందించింది. అలాగే, ఎక్స్ చేంజ్ అఫర్  మరియు No Cost EMI అప్షన్ కూడా వున్నాయి. ఈ ఫోన్ ధరలు ఈ క్రింద చూడవచ్చు.

(8GB + 128GB) వేరియంట్ ధర   : రూ.33,990

(12GB + 256GB) వేరియంట్ ధర : రూ.37,990

iQOO 9:

iQOO 9 స్మార్ట్ ఫోన్ ఈ సిరీస్ లో లభించే మధ్యస్థ ధర ఫోన్ మరియు ఈ ఫోన్ యొక్క Pre-Order ఫిబ్రవరి 23 నుండి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ పైన 6,000 రూపాయల వరకూ ICICI బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ కూడా అందించింది. అలాగే, ఎక్స్ చేంజ్ అఫర్  మరియు No Cost EMI అప్షన్ కూడా వున్నాయి. ఈ ఫోన్ ధరలు ఈ క్రింద చూడవచ్చు.             

(8GB + 128GB) వేరియంట్ ధర   : రూ.42,990

(12GB + 256GB) వేరియంట్ ధర : రూ.46,990          

iQOO 9 Pro:

iQOO 9 Pro స్మార్ట్ ఫోన్ ఈ సిరీస్ లో హై ఎండ్ స్మార్ట్ ఫోన్ మరియు భారీ ఫీచర్లతో కూడా ఉంటుంది. ఈ ఫోన్ యొక్క Pre-Orders కూడా  ఫిబ్రవరి 23 నుండి ప్రారంభమవుతాయి. ఈ ఫోన్ పైన 6,000 రూపాయల వరకూ ICICI బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ కూడా అందించింది. అలాగే, ఎక్స్ చేంజ్ అఫర్  మరియు No Cost EMI అప్షన్ కూడా వున్నాయి. ఈ ఫోన్ ధరలు ఈ క్రింద చూడవచ్చు.                

(8GB + 256GB) వేరియంట్ ధర   : రూ.64,990

(12GB + 256GB) వేరియంట్ ధర : రూ.69,990

ఈ ఫోన్లను అమెజాన్ నుండి కొనుగోలు చెయ్యవచ్చు. ఇప్పటికే కొనసాగుతున్న iQOO కస్టమర్లు లోయల్టి ప్రోగ్రామ్ ద్వారా వారి పాత ఐకూ స్మార్ట్ ఫోన్ అప్గ్రేడ్ తో 10,000 రూపాయల వరకూ అదనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. iQOO 9 స్మార్ట్ ఫోన్ ఫీచర్లను ఈ క్రింద చూడవచ్చు.

iQOO 9: స్పెక్స్

iQOO 9 స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్  కలిగిన 6.56-అంగుళాల 10-బిట్ AMOLED ప్యానెల్‌ను ఈ ఫోన్ కలిగివుంది. ఇది HDR10+  కి సపోర్ట్ చేస్తుంది మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 888+ చిప్ సెట్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా LPDDR5 + UFS 3.1కాన్ఫిగరేషన్ కలిగిన 12GB ర్యామ్ మరియు స్టోరేజ్ 256 అప్షన్ లను అందిస్తుంది.ఈ ఫోన్ Android 12 ఆధారితమైన FunTouchOs 12  స్కిన్ పైన నడుస్తుంది.

కెమెరా విభాగంలో, 13MP వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 13MP 50mm ప్రొఫెషనల్ పోర్ట్రెయిట్ లెన్స్‌తో పాటు 48MP IMX 598 సెన్సార్‌తో గల రియర్ కెమెరా సెటప్ మరియు ముందు భాగంలో 16MP లెన్స్‌ ఉంటుంది. ఇందులో, Gimbal స్టెబిలైజేషన్ సెటప్ ను కూడా అందించింది. ఈ ఫోన్ 4,350mAh బ్యాటరీని ప్యాక్‌ చేస్తుంది మరియు ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతునిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :