రేపు ఇండియాలో విడుదలకానున్న మరొక 5G స్మార్ట్ ఫోన్ IQOO 3 5G

Updated on 24-Feb-2020
HIGHLIGHTS

ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఇండియాలో విడుదల చెయ్యనుంది.

అందరికంటే ముందుగా ఇండియాలో 5G స్మార్ట్ ఫోన్ ప్రకటించిన ఘనత IQOO సంస్థకే దక్కుతుంది. వివో నుండి వేరుపడి సపరేట్ బ్రాండ్ గా ఏర్పడిన iQOO ఇప్పుడు ఇండియాలో తన ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ అయినటువంటి IQOO 3 స్మార్ట్ ఫోన్ను 5G టెక్నాలజీతో లాంచ్ చేయడానికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ను రేపు మధ్యాహ్నం 12:30 నిముషాలకు ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఇండియాలో విడుదల చెయ్యనుంది.

అయితే, ముందుగా వచ్చిన కొన్ని లీకుల ద్వారా ఈ ఫోన్ యొక్క పూర్తి సృషిఫెషన్లు విడుదల కంటే ముందుగానే తెలిసిపోయాయి. ప్రస్తుతం ఈ లీక్ కి సంబంధించిన లీక్ ఇమేజిలు ట్విట్టరులో షేర్ అవుతున్నాయి. ఇక విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్,క్వాల్కమ్ యొక్క సరికొత్త వేగవంతమైన స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ , 5G సపోర్ట్ తో పాటుగా మల్టి టర్బో అల్ట్రా గేమింగ్ మోడ్ మరిన్ని వంటి గొప్ప ప్రత్యేకతలతో రానున్నట్లు అర్ధమవుతోంది.

ఇక దీని కెమేరాల విషయానికి వస్తే, ఇందులో 48MP AI క్వాడ్ కెమేరాని మరియు ముందు పంచ్హోల్ డిజనులో సింగిల్ సెల్ఫీ కెమెరాని అఫర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక డిస్ప్లేవిషయానికి వస్తే , ఇది 180Hz  టచ్ రెస్పాన్స్ రేటు గల పోలార్ వ్యూ డిస్ప్లే అదికూడా E3 సూపర్ AMOLED డిస్ప్లేని మాస్టర్ టచ్ బటన్స్ తో తీసుకొస్తోంది. అదనంగా, LPDDR5 ర్యామ్, UFS 3.1 ROM ని అఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, గేమింగ్ కోసం ప్రత్యేకంగా 4D గేమ్ వైబ్రేషన్ కూడా ఇందులో ఇచ్చినట్లు చూపిస్తున్నారు.                             

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :