iQOO 15R పవర్ ఫుల్ ట్రిపుల్ చిప్ సెటప్ తో లాంచ్ అవుతోంది.!

Updated on 31-Jan-2026
HIGHLIGHTS

iQOO 15R స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ కన్ఫర్మ్ చేసిన కంపెనీ

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్స్ అనౌన్స్ చేయడం కూడా ఆరంభించింది

పవర్ ఫుల్ ట్రిపుల్ చిప్ సెటప్ తో లాంచ్ అవుతోందని ఐకూ అనౌన్స్ చేసింది

iQOO 15R స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ కన్ఫర్మ్ చేసిన కంపెనీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్స్ అనౌన్స్ చేయడం కూడా ఆరంభించింది. ఈ అప్ కమింగ్ ఫోన్ కొత్త అప్‌డేట్ ద్వారా ఈ ఫోన్ పవర్ ఫుల్ ట్రిపుల్ చిప్ సెటప్ తో లాంచ్ అవుతోందని ఐకూ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ కలిగిన ఆ ట్రిపుల్ చిప్ మరియు ఇతర కీలక ఫీచర్స్ ఏమిటో తెలుసుకుందామా.

iQOO 15R : లాంచ్ ఎప్పుడు?

ఈ ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 24వ తేదీ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం ఫీచర్స్ మరియు ప్రీమియం డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు కూడా ఐకూ తెలిపింది. ఐకూ 15R స్మార్ట్ ఫోన్ అమెజాన్ ప్రత్యేకమైన ఫోన్ గా లాంచ్ అవుతుంది. అందుకే, అమెజాన్ ఇండియా ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన టీజర్ పేజీ అందించి టీజింగ్ చేస్తోంది.

iQOO 15R : కీలక ఫీచర్స్

ఐకూ 15R స్మార్ట్ ఫోన్ సరికొత్త డిజైన్ కలిగి ఉంది మరియు ఈ ఫోన్ చాలా స్లీక్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ చిప్ సెట్ Snapdragon 8 Gen 5 తో అందిస్తున్నట్లు ఐకూ కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, డిస్ప్లే మరియు మరింత వేగం కోసం Q2 సూపర్ కంప్యూటింగ్ చిప్ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది. ఈ రెండు కాకుండా ఈ ఫోన్ లో మరింత గొప్ప సిగ్నల్ కోసం నెట్ వర్క్ ఎన్‌హాన్స్‌మెంట్ చిప్ ను కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ కలిగిన మూడు చిప్ ల ప్రభావంతో గొప్ప వేగం మరియు స్మూత్ గేమింగ్ వంటి గొప్ప ఫలితాలను ఈ ఫోన్ అందిస్తుందని ఐకూ చెబుతోంది. ఈ ఫోన్ 1.5K గేమ్ సూపర్ రిజల్యూషన్ తో ఉంటుంది. అంతేకాదు, BGMI గేమ్ ను 144Hz FPS లో కూడా ఆఫర్ చేస్తుంది. అలాగే, నెట్ వర్క్ బూస్ట్ కోసం ఈ ఫోన్ కలిగిన ప్రత్యేకమైన చిప్ తో 20% లోవర్ సెల్యులార్ గేమింగ్ లెటెన్సీ తో కూడా వస్తుంది.

Also Read: ఈరోజు అతి చవక ధరలో లభిస్తున్న బెస్ట్ 43 ఇంచ్ 4K Smart Tv ఇదే.!

ఈ ఫోన్ ను ఆరిజిన్ OS 6 తో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ 4 సంవత్సరాల OS అప్‌డేట్స్ మరియు 6 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచెస్ కూడా అందుకుంటుంది. ఇందులో వన్ ట్యాప్ ట్రాన్స్‌ఫర్ మరియు కంప్లీట్ నోటిఫికేషన్ కోసం ఆరిజిన్ ఐలాండ్, స్క్రీన్ మిర్రరింగ్ మరియు క్రాస్ డిజైన్ ఫైల్ ట్రాన్స్‌ఫర్ వంటి మరిన్ని ఫీచర్స్ ఉంటాయి. ఈ ఫోన్ మరిన్ని కీలక ఫీచర్స్ త్వరలోనే ఐకూ రివీల్ చేస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :