iQOO 15 ఇండియా లాంచ్ ప్రైస్ మరియు కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.!

Updated on 26-Nov-2025
HIGHLIGHTS

iQOO 15 స్మార్ట్ ఫోన్ ఈరోజు భారత్ మార్కెట్లో లాంచ్ అయ్యింది

ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Elite Gen 5 చిప్ సెట్ తో వచ్చింది

ఓవరాల్ గా ఈ ఫోన్ ప్రీమియం ఫీచర్స్ మరియు డిజైన్ తో లాంచ్ అయ్యింది

iQOO 15 స్మార్ట్ ఫోన్ ఈరోజు భారత్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం మార్కెట్లో ప్రీమియం హై ఎండ్ చిప్ సెట్ గా చలామణి అవుతున్న స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 తో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అంతేకాదు, డ్యూయల్ యాక్సిస్ వైబ్రేషన్ మోటార్ కలిగిన మొదటి ఫోన్ గా ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ డిజైన్ మొదలుకొని బ్యాటరీ వరకు కంప్లీట్ ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఈ లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ ప్రైస్ మరియు కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.

iQOO 15 : ప్రైస్

ఐకూ 15 స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఇందులో 12 జీబీ + 256 జీబీ బేసిక్ వేరియంట్ ను రూ. 72,999 ధరతో మరియు 16 జీబీ + 512 జీబీ బేసిక్ వేరియంట్ ను రూ. 79,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ సేల్ అమెజాన్ మరియు ఐకూ అధికారిక వెబ్‌సైట్ నుంచి సేల్ అవుతుంది.

ఆఫర్స్ :

iQOO 15 Price and Offers

ఈ లేటెస్ట్ ఫోన్ పై గొప్ప బ్యాంక్ మరియు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ పై రూ. 7,000 బ్యాంక్ డిస్కౌంట్ మరియు రూ. 7,000 ఎక్స్ చేంజ్ డిస్కౌంట్ ఆఫర్ ఈ ఫోన్ పై అందించింది. ఈ రెండు ఆఫర్స్ లో ఏదైనా ఒకటి మాత్రమే లభిస్తుంది. ఇది కాకుండా ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల అదనపు కూపన్ డిస్కౌంట్ ఆఫర్ కూడా జత చేసింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 64,999 ప్రారంభ ధరతో లభిస్తుంది. ఈ ఫోన్ డిసెంబర్ 1 నుంచి సేల్ అందుబాటులోకి వస్తుంది. అయితే, ప్రియారిటీ పాస్ యూజర్లకు నవంబర్ 27 తేదీ మధ్యాహ్నం నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుంది.

Also Read: Realme P4x : ఫాస్ట్ చిప్ సెట్ మరియు బిగ్ బ్యాటరీతో వస్తుంది.!

iQOO 15 : ఫీచర్స్

ఐకూ ఈ సార్ట్ ఫోన్ ను ప్రీమియం డిస్ప్లే మరియు దీనికి తగిన ప్రత్యేకమైన చిప్ తో జత చేసి అందించింది. ఈ ఫోన్ లో 6.85 ఇంచ్ బిగ్ 2K M14 OLED స్క్రీన్ అందించింది. ఈ స్క్రీన్ 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 144Hz రిఫ్రెష్ రేట్, 8T సర్క్యూట్ డిజైన్ మరియు డాల్బీ విజన్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో గేమింగ్ మరియు సూపర్ రిజల్యూషన్ కోసం సూపర్ కంప్యూటింగ్ చిప్ Q3 కూడా ఉంటుంది.

ఇక మెయిన్ ప్రోసెసర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Elite Gen 5 చిప్ సెట్ తో వచ్చింది. ఇది 40 లక్షల కంటే ఎక్కువ AnTuTu స్కోర్ కలిగిన 4nm TSMC ప్రొసెస్ టెక్ కలిగిన చిప్ సెట్. ఇందులో 16 జీబీ LPDDR5x అల్ట్రా ర్యామ్ మరియు 12 జీబీ అదనపు ర్యామ్ ఫీచర్ కూడా ఉంటుంది. అల్ట్రా ఫాస్ట్ తో పని చేసే వేడి ‘తగ్గించడానికి వీలుగా 8K సింగిల్ లేయర్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం కూడా అందించింది. ఇది ఫోన్ ను చల్లగా చేస్తుంది.

కెమెరా పరంగా, 50MP Sony IMX 921 మెయిన్ సెన్సార్, 50MP టెలిఫోటో సెన్సార్ మరియు 50MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఈ ఫోన్ లో అందించింది. ఇది 3x ఆప్టికల్ జూమ్ మరియు 100x డిజిటల్ జూమ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 4K వీడియో సపోర్ట్ కలిగిన 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ గుట్టల కొద్దీ కెమెరా ఫీచర్స్ మరియు టన్నుల కొద్దీ AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

ఐకూ 15 స్మార్ట్ ఫోన్ గొప్ప సౌండ్ అందించే సిమెట్రికల్ డ్రమ్ మాస్టర్ స్పీకర్ ప్రో డ్యూయల్ స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన డ్యూయల్ యాక్సిస్ వైబ్రేషన్ మోటార్ తో ట్రూ 4D వైబ్రేషన్ అందిస్తుందని ఐకూ తెలిపింది. డిజైన్ పరంగా, ఈ ఫోన్ ఫైబర్ గ్లాస్ బ్యాక్ మరియు మెటల్ ఫ్రేమ్ కలిగి ఉంటుంది. ఇందులో 100W వైర్డ్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ మరియు 40W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 7000 mAh సిలికాన్ యానోడ్ బ్యాటరీ కూడా అందించింది. ఓవరాల్ గా ఈ ఫోన్ ప్రీమియం ఫీచర్స్ మరియు డిజైన్ తో లాంచ్ అయ్యింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :