iQOO 15 india launch and key specs revealed
iQOO 15 ఇండియా లాంచ్ మరియు కీలకమైన ఫీచర్స్ సైతం ఐకూ వెల్లడించింది. ఈ ఫోన్ ముందుగా చైనాలో లాంచ్ అవుతుంది మరియు తర్వాత ఇండియాలో లాంచ్ అవుతుందని ఐకూ అనౌన్స్ చేసింది. ఐకూ యొక్క ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ప్రీమియం ఫీచర్స్ మరియు ప్రీమియం డిజైన్ తో ఉన్నట్లు కంపెనీ గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ను సేల్ పార్ట్నర్ గా కూడా అనౌన్స్ చేసింది. అందుకే, ఈ ఫోన్ లాంచ్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి ద్వారా టీజింగ్ చేస్తోంది.
ఐకూ 14 స్మార్ట్ ఫోన్ నవంబర్ నెలలో లాంచ్ అవుతుందని ఐకూ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం కంపెనీ ఇప్పటి నుంచే టీజింగ్ మొదలు పెట్టింది మరియు ఈ ఫోన్ కీలక స్పెక్స్ కూడా ఈ టీజర్ లో భాగంగా బయటకు వెల్లడించడం మొదలు పెట్టింది. ఇప్పటికే ఈ ఫోన్ డిజైన్ మరియు ఇతర ఫీచర్స్ కూడా ఐకూ బయటకు వెల్లడించింది.
ఐకూ 15 స్మార్ట్ ఫోన్ డిజైన్ పరంగా మరింత ప్రీమియం గా ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక LED లైట్ బంప్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Elite చిప్ సెట్ తో లాంచ్ అవుతుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆరిజిన్ OS 6 సాఫ్ట్ వేర్ తో లాంచ్ ఆవుతుంది. అంటే, ఈ ఫోన్ గూగుల్ యొక్క లేటెస్ట్ Android 16 OS తో వస్తుంది. ఇండియాలో లాంచ్ కాబోతున్న ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క ఈ ఫీచర్స్ గురించి కంపెనీ వెల్లడించింది.
అయితే, ఈ ఫోన్ చైనాలో ఇప్పటికే లాంచ్ అయ్యింది కాబట్టి మిగిలిన ఫీచర్స్ కూడా మనకు ముందే తెలిసాయి. ఈ ఫోన్ చైనా వేరియంట్ 6.85 ఇంచ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్, 2K రిజల్యూషన్ మరియు గొప్ప బ్రైట్నెస్ తో ఉంటుంది. ఈ ఫోన్ HDR 10+, డాల్బీ విజన్ మరియు 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఉంటుంది.
Also Read: MOTOROLA Edge 60 Fusion 5G పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!
కెమెరా పరంగా, ఈ ఫోన్ లో 100X జూమ్ సపోర్ట్ కలిగిన 50MP సోనీ పెరిస్కోప్ కెమెరా, 50MP సోనీ మెయిన్ కెమెరా మరియు 50MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. అలాగే, ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ AI విజువల్స్ మరియు 4K వీడియో రికార్డింగ్ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఐకూ ఫోన్ 7000 mAh భారీ బ్యాటరీ మరియు 100W అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఇండియాలో కూడా ఇదే ఫీచర్స్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.