iQOO 15 లాంఛ్ కంటే ముందే ఫీచర్స్ మరియు ప్రైస్ ముందే తెలుసుకోండి.!

Updated on 25-Nov-2025
HIGHLIGHTS

iQOO 15 స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది

ఈ ఫోన్ భారీ ఫీచర్స్ మరియు గొప్ప డిజైన్ తో ఉంటుంది

ఐకూ 15 స్మార్ట్ ఫోన్ చాలా ప్రీమియం ఫీచర్స్ మరియు గొప్ప డిజైన్ కలిగి ఉంటుంది

iQOO 15 స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహిస్తోంది మరియు ఈవెంట్ నుంచి ఈ ఫోన్ ను లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ భారీ ఫీచర్స్ మరియు గొప్ప డిజైన్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ ఫీచర్స్ మరియు ప్రైస్ ముందే తెలుసుకోండి.

iQOO 15 : ఫీచర్స్

ఐకూ 15 స్మార్ట్ ఫోన్ చాలా ప్రీమియం ఫీచర్స్ మరియు గొప్ప డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 2K రిజల్యూషన్ కలిగిన Samsung M14 OLED స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ లో అల్ట్రా ఫాస్ట్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది మరియు 2600 HBM బ్రైట్నెస్ తో పాటు Dolby విజన్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. గేమింగ్ కోసం అనువైన 144Hz రిఫ్రెష్ రేట్ మరియు Q3 సూపర్ కంప్యూటింగ్ చిప్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ హై గ్రేడ్ చిప్ సెట్ Snapdragon 8 Elite Gen 5 తో పని చేస్తుంది. ఇది 40 లక్షల కంటే ఎక్కువ AnTuTu స్కోర్ అందించే అల్ట్రా ప్రీమియం చిప్ సెట్ మరియు TSMC 3nm ప్రోసెస్ టెక్నాలజీతో ఉంటుంది. ఈ ఫోన్ LPDDR5x అల్ట్రా ఫాస్ట్ ర్యామ్ మరియు UFS 4.1 ఫాస్ట్ ర్యామ్ సపోర్ట్ తో లాంచ్ అవుతుంది.

కెమెరా విభాగానికి వస్తే, ఈ ఫోన్ లో 50MP సోనీ పెరిస్కోప్ మెయిన్ కెమెరా, 50MP సోనీ VCS కెమెరా మరియు 50MP సోనీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సెటప్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇది 100x జూమ్, 120FPS 4K డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు మల్టీ ఫంక్షన్ పోర్ట్రైట్ వంటి గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ ఆరిజిన్ OS తో వచ్చే గొప్ప ఎఐ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

ఐకూ 15 స్మార్ట్ ఫోన్ సిమెట్రికల్ డ్యూయల్ మాస్టర్ స్పీకర్ డ్యూయల్ యాక్సిస్ వైబ్రేషన్ మోటార్ వంటి అదనపు ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP 68 అండ్ IP 69 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో కూడా ఉంటుంది. ఈ ఫోన్ 7000 mAh సిలికాన్ ఆనోడ్ బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇందులో ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ మరియు 40W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది.

Also Read: Realme C85 5G: బడ్జెట్ సిరీస్ నుంచి 7000 mAh బిగ్ బ్యాటరీ ఫోన్ వస్తోంది.!

iQOO 15 : అంచనా ధర

ఈ ఫోన్ ఇండియాలో రూ. 65,000 నుంచి రూ. 70,000 మధ్యలో ఉండవచ్చని చెబుతున్నారు. అయితే, ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ అండర్ రూ. 75,000 ధరలో లాంచ్ కావచ్చని అంచనా వేసి చెబుతున్నారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :