iQOO 12 5G top 5 features and price is here
గత నెల రోజులుగా ఐకూ టీజింగ్ చేస్తున్న ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ iQOO 12 5G ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్ లో విడుదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ భ్రి స్పెక్స్ మరియు ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసింది. ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ ఓవలారల్ ఫీచర్స్ తో లాంచ్ అయినా ఇందులో ఒక ఐదు ప్రత్యేకతలు బాగా ఆకర్షిస్తున్నాయి. అందుకే, ఇండియన్ మార్కెట్ లో సరికొత్తగా విడుదలైన ఐకూ 12 5జి స్మార్ట్ ఫోన్ యొక్క టాప్ 5 ఫీచర్స్ మరియు ధర వివరాలను విపులంగా తెలుసుకుందాం.
ఐకూ 12 5జి స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్స్ మరియు రెండు కలర్ ఆప్షన్ లలో విడుదల చెయ్యబడింది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ (12GB+ 256GB) రూ. 52,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క హై ఎండ్ వేరియంట్ 16GB RAM మరియు 512GB స్టోరేజ్ తో రూ. 57,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ పైన ఆకర్షణీయమైన లాంచ్ ఆఫర్లను కూడా జత చేసింది.
ఈ ఫోన్ ను ICICI మరియు HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారు రూ. 3,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ ను అందుకుంటారు. లేదా, పాత ఫోన్ ఎక్స్ చేంజ్ తో రూ. 3000 రూపాయల అధనపు తగ్గింపును అందుకోవచ్చు. అలాగే, ఐకూ లేదా వివో ఫోన్ల ఎక్స్ చేంజ్ పైన రూ. 2,000 రూపాయల అధనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను ఆఫర్ ను కూడా ప్రకటించింది.
ఈ ఫోన్ 6.78 ఇంచ్ డిస్ప్లేని 1.5K రిజల్యూషన్ LTPO AMOLED డిస్ప్లేని కలిగి వుంది. అయితే, ఈ డిస్ప్లే 452 PPI, P3 కలర్ గ్యాముట్ మరియు 3000 నిట్స్ లోకల్ పీక్ బ్రెట్నెస్ట్ తో పాటుగా 144Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి వుంది. ఈ డిస్ప్లే గేమింగ్ సమయంలో అత్యధికమైన రిజల్యూషన్ అందిస్తుంది.
Also Read : Gold Rate: గోల్డ్ మార్కెట్ ఢమాల్..ఎంత తగ్గిందంటే.!
ఈ ఫోన్ ప్రోసెసర్ పరంగా గొప్ప పేరును అందుకుంది. ఎందుకంటే, ఐకూ 12 5జి స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Gen 3 ప్రోసెసర్ తో ఇండియాలో విడుదలైన మొదటి ఫోన్ ఇదే. ఈ ప్రోసెసర్ 2.1 M కు పైగా AnTuTU స్కోర్ ను కలిగి వుంది. అంటే, ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. దీనికి జతగా ఐకూ ప్రత్యేకంగా తయారు చేసిన Q1 సూపర్ కంప్యూటింగ్
ఐకూ 12 5జి స్మార్ట్ ఫోన్ లో ఫాస్ట్ ర్యామ్, బిగ్ స్టోరేజ్ లను జత చేయడం ద్వారా పెర్ఫార్మెన్స్ ను మరింతా పీక్ కు తీసుకు వెళ్ళింది. ఈ ఫోన్ లో 12GB/16GB LPDDR5X RAM మరియు 256GB/512GB UFS 4.0 ఫాస్ట్ & బిగ్ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.
50MP + 50MP + 64MP కెమేరా సెటప్ తో ఇండియన్ మార్కెట్ లో వచ్చిన మొదటి కూడా ఇదే అవుతుందని ఐకూ తెలిపింది. ఈ సెటప్ లో అందించిన కెమేరాలలో 50MP ఆస్ట్రోగ్రఫీ మెయిన్ కేమేరా, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమేరా మరియు 64MP 3X పెరిస్కోప్ టెలిఫోటో కెమేరా ఉన్నాయి. ఈ కెమేరా 100X డిజిటల్ జూమ్, OIS 2.0 మరియు 4K Night View Video వంటి మరిన్ని గొప్ప ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఐకూ 12 5జి స్మార్ట్ ఫోన్ ను హై పెర్ఫార్మెన్స్ అందించగల 5000 mAh గ్రాఫైట్ బ్యాటరీని అత్యంత వేగవంతమైన భారీ 120W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది.
ఈ పైన తెలిపిన టాప్ 5 ఫీచర్లు ఈ ఫోన్ ను మరింత విలక్షణముగా ఉండేలా చేస్తున్నాయి.