iPhone 16 now available at 60k offer price on amazon sales
iPhone 16 ఇప్పుడు అమెజాన్ లేటెస్ట్ దివాళి స్పెషల్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ అవుతోంది. ఈ ఫోన్ అన్ని ఆఫర్స్ తో కలుపుకొని కేవలం 60 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లోనే లభిస్తుంది. లేటెస్ట్ ఐఫోన్ ను 60 వేల రూపాయల బడ్జెట్ ధరలో కొనాలని చూస్తున్న ఐఫోన్ ప్రేమికులు ఈ ఫోన్ డీల్ పై ఒక లుక్కేయవచ్చు.
ఐఫోన్ 16 ఇండియాలో రూ. 79,900 రూపాయల స్టార్టింగ్ ప్రైస్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళి స్పెషల్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ అందుకుని రూ. 66,900 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. ఈ ఫోన్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 4,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అమెజాన్ అందించింది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ పై రూ. 1,000 నుంచి రూ. 2,000 వరకు అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది.
అమెజాన్ అందించిన అన్ని ఆఫర్స్ తో ఐఫోన్ ను కేవలం రూ. 60,900 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచ్చు. వాస్తవానికి, ఈరోజు కూడా ఐఫోన్ 16 ఫోన్ యాపిల్ అఫీషియల్ సైట్ నుంచి రూ. 69,900 రూపాయల ధరతో సేల్ అవుతోంది. ఈ ఫోన్ ను అమెజాన్ సేల్ నుంచి ఆఫర్ ధరతో కొనడానికి Buy From Here పై నొక్కండి.
Also Read: Flipkart Sale: 32 ఇంచ్ టీవీ రేటుకే 43 ఇంచ్ 4K Smart TV అందుకోండి.!
ఐఫోన్ 16 గొప్ప డిజైన్ మరియు సూపర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 2x ఆప్టికల్ జూమ్ మరియు సూపర్ రిజల్యూషన్ కలిగిన 48MP ఫ్యూజన్ కెమెరా జతగా 12MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 12MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 4K డాల్బీ విజన్ వీడియో సపోర్ట్ మరియు గొప్ప కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో ఆపిల్ ప్రత్యేకంగా అందించిన కెమెరా కంట్రోల్ బటన్ కూడా ఉంటుంది.
ఈ ఆపిల్ ఫోన్ A18 చిప్ తో పని చేస్తుంది మరియు ఇది యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ ఫోన్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ 6.1 ఇంచ్ సూపర్ రెటీనా XDR స్క్రీన్ కలిగి ఉంటుంది. 22 గంటల వీడియో ప్లే బ్యాక్ అందించే బ్యాటరీ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు USB టైప్ C ఛార్జ్ పోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఫేస్ ఐడి, ఎమర్జెన్సీ SOS మరియు క్రాష్ డిటక్షన్ వంటి అదనపు ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.