యాపిల్ లేటెస్ట్ మోడళ్ళు అయిన Apple iPhone 14 Pro సిరీస్ స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు సేల్ కి అందుబాటులోకి వచ్చాయి. వాస్తవానికి, యాపిల్ ఈ సంవత్సరం 4 కొత్త ఫోన్లను ఆవిష్కరించింది. iPhone 14, 14 Plus, 14 Pro మరియు 14 Pro Max ఫోన్లను యాపిల్ లాంచ్ చేయగా, వీటిలో ఐఫోన్ 14 ప్రో సిరీస్ ఫోన్లు ఇప్పుడు ఉపలబ్ధమవుతున్నాయి. అయితే, ఐఫోన్ 14 మరియు 14 ప్లస్ మాత్రం అక్టోబర్ 7 నుండి లభిస్తాయి. యాపిల్ లేటెస్ట్ iPhone 14 సిరీస్ ఫోన్ల గురించి మీరు తెలుసుకోవాల్సిన వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ఈ లేటెస్ట్ ఐఫోన్ ల ధరలను క్రింద చూడవచ్చు:
Apple iPhone 14: రూ.79,000 నుండి ప్రారంభవుతుంది మరియు ఇది 128GB వేరియంట్ ధర
Apple iPhone 14 Plus: రూ.89,900 నుండి ప్రారంభవుతుంది మరియు ఇది 128GB వేరియంట్ ధర
Apple iPhone 14 Pro: రూ.1,29,900 నుండి ప్రారంభవుతుంది మరియు ఇది 128GB వేరియంట్ ధర మరియు హై ఎండ్ వేరియంట్ ధర 1,79,900 (1TB)
Apple iPhone 14 Pro Max: రూ.1,39,900 నుండి ప్రారంభవుతుంది మరియు ఇది 128GB వేరియంట్ ధర మరియు హై ఎండ్ వేరియంట్ ధర 1,89,900 (1TB)
ఈ ఫోన్లను HDFC క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 6,000 క్యాష్ బ్యాక్ ను యాపిల్ అఫర్ చేస్తోంది. అంతేకాదు, EMI అప్షన్ ను కూడా యాపిల్ ఇండియా వెబ్సైట్ అఫర్ చేస్తోంది.
ఇక ఈ కొత్త యాపిల్ ఫోన్ల ఫీచర్ల ప్రత్యేకతల విషయానికి వస్తే, 6.1 ఇంచ్ రెటీనా XDR డిస్ప్లేతో iPhone 14 ఫోన్ వస్తే, iPhone 14 Plus ఫోన్ పెద్ద 6.7 ఇంచ్ రెటీనా XDR డిస్ప్లేతో ఉంటాయి. Pro సిరీస్ లో కూడా ఐఫోన్ 14 ప్రో 6.1 ఇంచ్ డిస్ప్లే తో వస్తే, ప్రో మ్యాక్స్ 6.7 ఇంచ్ బిగ్ డిస్ప్లే తో వస్తుంది. ప్రో సిరీస్ ఫోన్లు 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తాయి మరియు 1600 పీక్ బ్రైట్నెస్ ను అందించగలవు. 14 మరియు 14 Plus పాత-జెనరేషన్ A15 బయోనిక్ చిప్ తో వస్తే, 14 Pro సిరీస్ ఫోన్లు మాత్రం లేటెస్ట్ ఈ ఫోన్లు మాత్రం A15 బయోనిక్ చిప్ తో వస్తాయి మరియు ఇది 16-Core Neural Engine.
కెమెరాల పరంగా, ఐఫోన్ 14 ఫోన్లు 12MP + 12MP డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తే, ఐఫోన్ 14 ప్రో సిరీస్ ఫోన్లు మాత్రం 48MP+12MP+12MP సెటప్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరాతో వస్తాయి.