infinix మొబైల్ తయారీ సంస్థ ఇండియాలో బడ్జెట్ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అందిస్తున్న కంపెనీగా పేరొందింది. ఈ కంపెనీ ఈరోజు తన లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ Zero 5G ని భారీ ఫీచర్లతో కేవలం బడ్జెట్ ధరలో విడుదల చేసింది. infinix Zero 5G స్మార్ట్ ఫోన్ ను Dimensity 900 5G ప్రోసెసర్, LPDDR5 ఫాస్ట్ ర్యామ్ మరియు UFS 3.1 స్టోరేజ్ వంటి మరియు మరిన్ని భారీ ఫీచర్లతో విడుదల చేసింది. ఈ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని వివరాలను ఈ క్రింద చూడవచ్చు.
Infinix Zero 5G స్మార్ట్ ఫోన్ పెద్ద 6.78 -అంగుళాల FHD + రిజల్యూషన్ గల IPS డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ మీడియా టెక్ Dimensity 900 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో వస్తుంది మరియు ఇది 8GB మరియు 128GB స్టోరేజ్ ఎంపికతో జత చేయబడుతుంది. అంతేకాదు, 5GB వరకూ ఎక్స్ టర్నల్ ర్యామ్ ను కూడా జతచేస్తుంది. ఇందులో, వేగవంతమైన LPDDR5 ర్యామ్ మరియు UFS 3.1 అల్ట్రా ఫాస్ట్ స్టోరేజ్ ని కలిగివుంది.
ఆప్టిక్స్ పరంగా, ఈ ఇన్ఫినిక్స్ 5G ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్-కెమెరా సెటప్ తో వస్తుంది. దీనిలో, ప్రధాన కెమెరా 48MP సెన్సార్ తో అందించింది. దీనికి జతగా 13MP పోర్ట్రైట్ లెన్స్ మరియు 2MP డెప్త్ సెన్సార్ ని జతచేసింది. ఈ కెమరాతో 2X ఆప్టికల్ జూమ్ మరియు 30X డిజిటల్ జూమ్ అందుతుంది.అంతేకాదు, ఈ కెమెరా సిస్టమ్ ను ప్రత్యేకమైన కర్వ్ డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ పెద్ద 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంటుంది.
Infinix Zero 5G స్మార్ట్ ఫోన్ 8జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ తో రూ.19,999 ధరతో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ ఫిబ్రవరి 18 మధ్యాహ్నం 12 గంటలకి Flipkart నుండి జరుగుతుంది. ఈ ఫోన్ కోసం చాలా లాంచ్ అఫర్ లను కూడా ప్రకటించింది. ఈ ఫోన్ కొనేవారు 999 రూపాయల విలువ గల iRocker బ్లూటూత్ హెడ్ సెట్ ను కేవలం 1 రూపాయికే పొందవచ్చు.