ఇండియాలో కేవలం బడ్జెట్ ధరలో స్మార్ట్ మంచి ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను అందిస్తున్న సంస్థగా పేరొందిన Infinix, ఇటీవల ఇండియాలో కేవలం రూ.9,999 ధరలో ఒక పాప్ అప్ సెల్ఫీ కెమేరాతో పాటుగా ఫుల్ వ్యూ డిస్ప్లే మరియు మరిన్ని ప్రత్యేకతలతో అందించినటువంటి Infinix S5 Pro యొక్క మొదటి సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకి Flipkart ద్వారా జరగనుంది.
Infinix S5 Pro (4GB + 64GB) : ధర – Rs.9,999
ఈ ఫోన్ కేవలం ఒకే ఒక్క వేరియంట్ తో మాత్రమే విడుదల చెయ్యబడింది.
ఈ స్మార్ట్ ఫోన్, ఒక 6.53 అంగుళాల పరిమాణం గల ఫుల్ వ్యూ డిస్ప్లేతో ఉంటుంది మరియు ఇది FHD + రిజల్యూషన్ అందిస్తుంది. ఈ డిస్ప్లే కంటెంట్ చక్కగా వీక్షించే విధంగా ఒక 19.5:9 ఆస్పెక్ట్ రేషియాతో వస్తుంది. ఇది 2.3 GHz వరకూ క్లాక్ స్పీడ్ అందించగల ఒక Mediatek Helio P35 ఆక్టా కోర్ ప్రొసెసరు శక్తితో వస్తుంది. అలాగే, ఇందులో గేమింగ్ కోసం కూడా ప్రత్యేకమైన గేమింగ్ మోడుతో వస్తుంది. ఈ ఫోన్ కేవలం 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజితో గల ఒకేఒక వేరియంట్ తో మాత్రమే వస్తుంది. ఒక డేడికేటెడ్ మెమోరికార్డుతో 256GB వరకు స్టోరేజిని పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే, ఇది ఒక వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సేటప్పుతో వస్తుంది. ఇందులో ఒక ప్రధాన 48MP కెమేరాకి జతగా 2MP డెప్త్ సెన్సార్ మరియు మూడవ లో లైట్ సెన్సార్ సేతప్పుతో వస్తుంది. అయితే, ముందు భాగంలో మాత్రం, 16MP పాప్ అప్ సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ఈ పాప్ అప్ సెల్ఫీ కెమేరాతో చాలా ఫీచర్లను కూడా అందించింది. ఇక ఈ ఫోన్ మొత్తానికి శక్తిని అందించాడాని సరిపడా 4000mAh బ్యాటరీని ఇందులో ఇచ్చింది.