ఈరోజు విడుదల కానున్న మరొక పాప్ అప్ కెమేరా స్మార్ట్ ఫోన్

Updated on 06-Mar-2020
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ను Infinix S5 Pro పేరుతొ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి లాంచ్ చెయ్యనుంది.

కేవలం బడ్జెట్ ధరలో మంచి స్పెక్స్ తో స్మార్ట్ ఫోన్లను అందిస్తున్న మొబైల్ తయారీదారుగా పేరొందిన Infinix సంస్థ, ఈరోజు ఇండియాలో తన మొట్టమొదటి పాప్ అప్ సెల్ఫీ కెమేరా ఫోన్ను ఇండియాలో విడుదల చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ను Infinix S5 Pro పేరుతొ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి లాంచ్ చెయ్యనుంది. ఇప్పటికే ఈఫోన్ యొక్క నమూనా చిత్రాలను Flipkart ఆన్లైన్ ప్లాట్ఫారం ద్వారా టీజింగ్ చేస్తోంది.

అంతేకాదు, ఇప్పటికే కొన్ని ప్రత్యేకతల గురించి ప్రకటించింది మరియు దీని రెండు కలర్ వేరియంట్లను కూడా చూపిస్తోంది. దీని ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ టీజింగ్ చిత్ర ద్వారా, వెనుక 48MP ట్రిపుల్ కెమేరాని ఇందులో అందించినట్లు చూపిస్తోంది. ఇక సెల్ఫీ కెమేరా విషయానికి వస్తే, ఇందులో ఒక 16MP పాప్ అప్ సెల్ఫీ కెమేరాని ప్రకటించింది. ఇక ఈఫోన్ యొక్క డిస్ప్లేని గురించి కూడా ప్రకటించింది.

ఇందులో ఎటువంటి నోచ్ లేనటువంటి ఫుల్ వ్యూ డిస్ప్లేని ఒక FHD+ రిజల్యూషనుతో ఇచ్చినట్లు చెబుతోంది. ఈ డిస్ప్లే ఒక 6.53 అంగుళాల పరిమాణంలో బెజెల్ లెస్ ఫీచరుతో ప్రకటించింది. ఇక ఈ ఫోన్ యొక్క ధర విషయానికి వస్తే, ఇప్పటి వరకూ కూడా మంచి స్పెక్స్ కలిగిన అని స్మార్ట్ ఫోన్లను కూడా చాలా తక్కువ ధరకు అందించిన హిస్టరీ ఈ సంస్తకు ఉంది కాబట్టి, ఈ ఫోన్ను కూడా చాలా తక్కువ ధరకే ప్రకటించే అవకాశం ఉందవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ గురించిన పూర్తి వివరాల కోసం  ఈ ఫోన్ విడుదల అయ్యే వరకూ వేచి చూడాల్సిందే.            

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :