Infinix Note 50s 5G: చవక ధరలో కర్వుడ్ స్క్రీన్ తో సహా భారీ ఫీచర్స్ తో వచ్చింది.!

Updated on 18-Apr-2025
HIGHLIGHTS

ఇన్ఫినిక్స్ 50 సిరీస్ నుంచి ఈరోజు కొత్త ఫోన్ ను విడుదల చేసింది

Infinix Note 50s 5G చవక ధరలో కర్వుడ్ స్క్రీన్ తో సహా భారీ ఫీచర్స్ తో లాంచ్

ఈ స్మార్ట్ ఫోన్ ను అతి సన్నని కర్వుడ్ స్క్రీన్ తో లాంచ్ చేసింది

Infinix Note 50s 5G: ఇన్ఫినిక్స్ 50 సిరీస్ నుంచి ఈరోజు కొత్త ఫోన్ ను విడుదల చేసింది. అంచనా వేయని విధంగా ఈ ఫోన్ ను చాలా చవక ధరలో కర్వుడ్ స్క్రీన్ తో సహా భారీ ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను అతి సన్నని కర్వుడ్ స్క్రీన్ తో లాంచ్ చేసింది మరియు ఈ ఫోన్ గొప్ప డిజైన్ తో ఆకట్టుకుంటుంది.

Infinix Note 50s 5G: ప్రైస్

ఇన్ఫినిక్స్ నోట్ 50 5జి స్మార్ట్ ఫోన్ బేసిక్ 8GB + 128GB వేరియంట్ ను రూ. 15,999 ధరకే లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క రెండవ 8GB + 256GB వేరియంట్ ను రూ. 17,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పై రూ. 1,000 అదనపు డిస్కౌంట్ అందించే ఆఫర్ కూడా అందించింది. ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ / డెబిట్ కార్డ్ తో కొనే వారికి లేదా ఈ ఫోన్ ని ఎక్స్ చేంజ్ ద్వారా తీసుకునే వారికి ఈ రూ. 1,000 డిస్కౌంట్ అందిస్తుంది. ఏప్రిల్ 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ Flipkart నుంచి సేల్ లభిస్తుంది.

Infinix Note 50s 5G: ఫీచర్స్

ఇన్ఫినిక్స్ నోట్ 50s స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచ్ 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300 Ultimate చిప్ సెట్ తో వస్తుంది. ఈ చిప్ సెట్ కి జతగా 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ 64MP Sony ప్రధాన కెమెరా 2MP కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ మరియు 13MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో, AIGC పోర్ట్రైట్ మరియు సూపర్ నైట్ ఫీచర్స్ తో పాటు 10X డిజిటల్ జూమ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ JBL స్పీకర్లు మరియు Hi-Res Audio సపోర్ట్ తో కూడా వస్తుంది.

Also Read: అమెజాన్ ఈరోజు భారీ ఆఫర్స్ తో అందించిన బెస్ట్ 5 స్టార్ Refrigerator డీల్స్ ఇవే.!

ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ XOS 15 సాఫ్ట్ వేర్ పై ఆండ్రాయిడ్ 15 OS తో పని చేస్తుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్, MIL-810H మిలటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, డైనమిక్ బార్ మరియు 8GB వర్చువల్ ర్యామ్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జ్ మరియు 10W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5500 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :