Infinix Note 12 Turbo: బడ్జెట్ 8GB+5GB ర్యామ్ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్..!!

Updated on 26-May-2022
HIGHLIGHTS

Infinix Note 12 రేపు మొదటిసారిగా అమ్మకానికి రానుంది

ఇన్ఫినిక్స్ నోట్ 12 కేవలం సింగిల్ వేరియంట్ లో లభిస్తుంది

ఈ ఫోన్ 8GB తో పాటుగా 5GB వర్చువల్ ర్యామ్ ను కూడా కలిగి వుంది

Infinix ఇటీవల లేటెస్ట్ గా ప్రకటించిన Note 12 Turbo రేపు మొదటిసారిగా అమ్మకానికి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ అతితక్కువ ధరలో 8GB+5GB ర్యామ్ ఫీచర్ తో వచ్చిన మొదటి ఫోనుగా నిలుస్తుంది. అంతేకాదు, మంచి గేమింగ్ ఎక్స్ పీరియన్స్ కోసం Dar Link 2.0 గేమ్ బూస్ట్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది. రేపు మొదటిసారిగా అమ్మకానికి రానున్న ఇన్ఫినిక్స్ యొక్క ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఆఫర్లు, ధర మరియు స్పెక్స్ లను క్రింద చూడవచ్చు.

Infinix Note 12: ధర & ఆఫర్లు

ఇన్ఫినిక్స్ నోట్ 12 కేవలం సింగిల్ వేరియంట్ లో లభిస్తుంది.ఇన్ఫినిక్స్ నోట్ 12 (8GB+128GB) ను రూ.14,999 రుపాయల ధరతో ప్రకటించింది. లాంఛ్ అఫర్ లో భాగంగా Axis బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ కొనేవారికి 1,000 డిస్కౌంట్ మరియు అతి తక్కువ No Cost EMI అఫర్ ను కూడా జతచేసింది. ఈ ఫోన్ సేల్ మే 28 నుండి Flipkart ద్వారా సేల్ కి వస్తుంది.

Infinix Note 12: స్పెక్స్ మరియు ఫీచర్లు

ఇన్ఫినిక్స్ నోట్ 12 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేని FHD + రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 180Hz టచ్ శాంప్లింగ్ 100% DCI P3 కలర్ గ్యాముట్, గరిష్టంగా 1000 నిట్స్ బ్రైట్నెస్ అందిచడంతో పాటుగా గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ Helio G96 ఆక్టా కొర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB తో పాటుగా 5GB వర్చువల్ ర్యామ్ ను కూడా కలిగి వుంది మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేసింది.

ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP ప్రధాన కెమెరాకి జతగా 2MP డెప్త్ మరియు AI లెన్స్ లను కలిగివుంది. ముందు భాగంలో, 16MP సెల్ఫీ కెమెరాని క్వాడ్ LED ఫ్లాష్ కూడా కలిగి వుంది. ఈ ఫోన్ లో టైప్-C ఛార్జింగ్ పోర్ట్ కలిగిన భారీ 5,000 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది. ఆడియో పరంగా, ఈ ఫోన్ లో DTS Surround Sound సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్లను కూడా అందించింది. ఈ ఫోన్ X10.6 సాఫ్ట్ వేర్ పైన ఆండ్రాయిడ్ 12 OS పైన పనిచేస్తుంది.      

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :