108MP ట్రిపుల్ కెమెరాతో కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకువస్తున్నఇన్ఫినిక్స్

Updated on 01-Jul-2022
HIGHLIGHTS

108 MP బిగ్ కెమెరాతో వస్తున్న ఇన్ఫినిక్స్ ఫోన్

ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అలాట్ చేసింది

భారీ 108MP ప్రధాన కెమెరా కలిగిన ట్రిపుల్ కెమెరాతో చూపిస్తోంది

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ Infinix బిగ్ కెమెరా సెటప్ తో తన కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయబోతున్నట్లు టీజర్ విడుదల చేసింది. ఇంఫినిక్స్ ప్రకటించిన ఆ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Infinix Note 12 5G మరియు ఈ ఫోన్ ను Flipkart ద్వారా టీజింగ్ చేస్తోంది. అంతేకాదు, ఇన్ఫినిక్స్ నోట్ 12 5జి స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అలాట్ చేసింది మరియు ముఖ్యమైన వివరాలతో కూడిన టీజర్ ను కూడా అందించింది. ఈ పేజ్ ద్వారా ఈ ఫోన్ ఎలా ఉండబోతుంది, అనే విషయం మనం అర్ధం చేసుకోవచ్చు. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజర్ వివరాలు ఏమిటో తెలుసుకుందామా.

Infinix Note 12 5G స్మార్ట్ ఫోన్  యొక్క కెమెరా వివరాలను కంపెనీ హైలెట్ చేసి చూపించింది. ఎందుకంటే, ఈ ఫోన్ ను భారీ 108MP ప్రధాన కెమెరా కలిగిన ట్రిపుల్ కెమెరా సిస్టంతో చూపిస్తోంది. అంతేకాదు, ఈ పేజ్ ద్వారా అందించిన ఇమేజ్ ల ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ AMOLED డిస్ప్లేని, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ గ్రిల్ మరియు ప్రైమరీ మైక్రో ఫోన్‌ లను కూడా మనం చూడవచ్చు. అలాగే, వెనుక వైపున పెద్ద బంప్ లో LED ఫ్లాష్ తో జత చేసిన 108MP కెమెరా సెటప్ చూడవచ్చు. ఈ కెమెరా f/1.75 అపర్చర్/24mm ASPH ని కూడా చూపిస్తోంది.

Infinix Note 12 5G స్మార్ట్ ఫోన్ నుండి మనం ఏమి ఆశించవచ్చు అని చూస్తే, ఈ ఫోన్ 6.5-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లేతో రావచ్చు. అలాగే, మిడ్ సెగ్మెంట్ 5G ప్రాసెసర్ MediaTek డైమెన్సిటీ 5G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తి వస్తుంది. ఈ ఫోన్ కనీసం 8GB RAM మరియు కనీసం 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడవచ్చు. ముందు భాగంలో, 16MP సెల్ఫీ కెమెరాని కలిగి ఉంటుంది. Infinix Note 12 5G ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ కలిగిన 5,000mAh బ్యాటరీతో రావచ్చని అంచనా వేస్తున్నారు.

Infinix Note 12 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను కంపెనీ ఇంకా వెల్లడించలేదు కాబట్టి, మరిన్ని వివరాలను గురించి ఇంఫినిక్స్ వెల్లడించవచ్చు. కొత్త అప్డేట్ వచ్చిన వెంటనే పూర్తి వివరాలను మీ ముందుకు తీసుకువస్తాం.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :