ఇండియాలో లాంచ్ కాబోతున్న బడ్జెట్ వర్చువల్ ర్యామ్ స్మార్ట్ ఫోన్..!

HIGHLIGHTS

ఇండియాలో లాంచ్ కాబోతున్న మరొక చవక స్మార్ట్ ఫోన్

Infinix Smart 7 HD లాంచ్ డేట్ మరియు టీజింగ్ స్పెక్స్ ను కంపెనీ అందించింది

స్మార్ట్ 7 HD ఫోన్ 2GB+ 2GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ లతో వస్తోంది

ఇండియాలో లాంచ్ కాబోతున్న బడ్జెట్ వర్చువల్ ర్యామ్ స్మార్ట్ ఫోన్..!

ఇండియాలో లాంచ్ కాబోతున్న మరొక చవక స్మార్ట్ ఫోన్. ప్రముఖ మొబైల్ కంపెనీ ఇన్ఫినిక్స్ ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అదే, Infinix Smart 7 HD స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ముందుగా వచ్చిన Infinix Smart 6 HD యొక్క నెక్స్ట్ జెనరేషన్ ఫోన్ గా వస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు టీజింగ్ స్పెక్స్ ను కూడా ఇన్ఫినిక్స్ అందించింది. అంతేకాదు, Flipkart ఈ ఫోన్ ను ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Infinix Smart 7 HD: టీజింగ్ స్పెక్స్ 

Infinix నుండి వచ్చిన Smart 6 HD యొక్క నెక్స్ట్ జెనరేషన్ ఫోనుగా వస్తున్న ఈ ఫోన్ కూడా తక్కువ ధరలో లాంచ్ కావచ్చని భావిస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ 28 న ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇన్ఫినిక్స్ స్మార్ట్  6 HD స్మార్ట్ ఫోన్ 6 వేల ఉప బడ్జెట్ ధరలో వచ్చింది. అయితే, స్మార్ట్ 7HD యొక్క ధర గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా బయటకి రాలేదు. అయితే,ఈ ఫోన్ కూడా 6వేల ఉప బడ్జెట్ ధరలో లాంచ్ కావచ్చని అంచనా వేస్తున్నారు. 

స్మార్ట్ 7 HD ఫోన్ ను 2GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ లతో లాంచ్ చెయ్యబడుతుంది. దీనితో పాటుగా ఫోన్ మరింత వేగంగా ఉండేందుకు వీలుగా 2GB వర్చువల్ ర్యామ్ ను కూడా ఉన్నట్లు ఇన్ఫినిక్స్ టీజర్ ద్వారా చెబుతోంది. ఈ ఫోన్ టీజింగ్ ఇమేజ్ ల ద్వారా ఈ ఫోన్ వెనుక పై భాగంలో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నట్లు మనం చూడవచ్చు. 

ఈ ఫోన్ వెనుక డ్యూయల్ కెమేరా సెటప్ కూడా కనిపిస్తోంది. ఈ ఫోన్ ముందు వాటర్ డ్రాప్ డిజైన్ తో డిస్ప్లే ని కూడా ఈ టీజింగ్ ఇమేజీల ద్వారా చూపిస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo