Infinix Hot 12 Play: చవక ధరకే భారీ ఫీచర్లతో వస్తోంది..!!

Updated on 21-May-2022
HIGHLIGHTS

Infinix Hot 12 Play స్మార్ట్ ఫోన్ మే 23 న ఇండియాలో విడుదల కానుంది

ఈ స్మార్ట్ ఫోన్ బిగ్ డిస్ప్లే, బిగ్ బ్యాటరీతో వస్తోంది

ఈ ఫోన్ ను కేవలం 9 వేల రూపాయల ధరలోనే అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది

Infinix Hot 12 Play స్మార్ట్ ఫోన్ మే 23 న ఇండియాలో విడుదల కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ బిగ్ డిస్ప్లే, బిగ్ బ్యాటరీతో వస్తోంది. అయినా కూడా ఈ ఫోన్ ను కేవలం 9 వేల రూపాయల ధరలోనే అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. టీజర్ ప్రకారం, ఈ ఫోన్ ను రూ.8,XXX ధరతో ప్రకటించనున్నట్లు సూచించింది. అంటే, ఈ ఫోన్ ను 9 వేల కంటే తక్కువ ధరలో విడుదల చేస్తున్నట్లు చెప్పకనే చెప్పింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ భారీ ఫీచర్లతోనే వస్తున్నట్లు టీజర్ ద్వారా అర్ధమవుతోంది. ఈ ఫోన్ ను ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా Flipkart టీజింగ్ చేసింది. అంటే, ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా వస్తోంది.

Infinix Hot 12 Play: స్పెక్స్ మరియు ఫీచర్లు

ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే స్మార్ట్ ఫోన్ టీజర్ ద్వారా కొన్ని కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లను కూడా వెల్లడించింది. టీజర్ ద్వారా, ఈ ఫోన్ ఎంటర్టైన్మెంట్ కు అనుకూలమైన పెద్ద 6.82 ఇంచ్ HD+ డిస్ప్లేని పంచ్ హోల్ డిజైన్ తో కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే గేమింగ్ మరియు స్పోర్ట్స్ కంటెంట్ కోసం ఉపయోగకరమైన 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ సపోర్ట్ వస్తుంది.

అంతేకాదు, ఈ ఫోన్ వేగవంతమైన Unisoc T610 ఆక్టా కొర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 4GB ర్యామ్ మరియు 3GB వర్చువల్ ర్యామ్ ను కూడా కలిగివుంది. అలాగే, ఇందులో స్టోరేజ్ ను కూడా 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేసింది. ఈ ఫోన్ టైప్-C ఛార్జింగ్ పోర్ట్ తో భారీ 6,000 mAh బ్యాటరీతో వస్తుంది. వెనుక 50MP డ్యూయల్ కెమెరా సెటప్ మరియు ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా ను కూడా కలిగి ఉంటుంది.             

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :