ఇన్ఫినిక్స్ నుండి Note 7 మరియు Note 7 Lite ఎంట్రీ లేవాల్ ఫోన్లుగా విడుదల

Updated on 07-Apr-2020
HIGHLIGHTS

ఈ రెండు ఫోన్లలో పంచ్-హోల్ డిస్ప్లే, 48 ఎంపి క్వాడ్ కెమెరా, పెద్ద బ్యాటరీ మరియు మీడియాటెక్ ప్రాసెసర్ ఉన్నాయి.

ఇన్ఫినిక్స్ మొబైల్స్, తన నోట్ సిరీస్‌ నుండి రెండు కొత్త స్మార్ట్‌ ఫోన్లను విడుదల చేసింది. అవి : Infinix Note 7 మరియు Infinix Note 7 Lite  మరియు ఇవి రెండు కొత్త ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ ఫోన్లుగ వచ్చాయి. ఈ రెండు ఫోన్లలో పంచ్-హోల్ డిస్ప్లే, 48 ఎంపి క్వాడ్ కెమెరా, పెద్ద బ్యాటరీ మరియు మీడియాటెక్ ప్రాసెసర్ ఉన్నాయి. ఈ సిరీస్‌లో పెద్ద 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది మరియు ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10 తో పనిచేస్తుంది. అయితే, ఇన్ఫినిక్స్ నోట్ 7 సిరీస్ ఎప్పుడు భారత మార్కెట్లో ప్రవేశపెడుతుందనే విషయం మాత్రం  స్పష్టంగా తెలియరాలేదు.

ఇన్ఫినిక్స్ నోట్ 7 : డిస్ప్లే

ఈ స్మార్ట్ ఫోన్  ఒక 6.95-అంగుళాల HD + డిస్ప్లేని కలిగి ఉంది. దీని రిజల్యూషన్ 720 × 1640 పిక్సెల్స్ మరియు 20.5: 9. ఆస్పెక్టు రేషియాతో వస్తుంది మరియు 91.5% స్క్రీన్ టూ బాడీ రేషియాతో ఉంటుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 7: ప్రాసెసర్

ఈ ఫోన్ మీడియాటెక్ హెలియో జి 70 తో వస్తుంది మరియు ఈ చిప్‌సెట్ రియల్మి 3 ఫోనులో కూడా కనిపించింది. సంస్థ అనేక వేరియంట్లలో ఈ స్మార్ట్ ఫోన్ను ప్రవేశపెట్టింది. ఇందులో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. మైక్రో SD కార్డ్ ద్వారా ఫోన్ స్టోరేజిని  కూడా పెంచవచ్చు.

ఇన్ఫినిక్స్ నోట్ 7 : కెమెరా

ఇక కెమెరా గురించి మాట్లాడితే, ఈ ఫోనులో క్వాడ్ కెమెరా సెటప్ ఇవ్వబడింది, దీనిలో 48 ఎంపి కెమెరా, 2 ఎంపి మాక్రో లెన్స్, 2 ఎంపి డెప్త్ సెన్సార్ మరియు డేడికేటెడ్ తక్కువ-కాంతి సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా అందించబడుతుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 7 : బ్యాటరీ మరియు OS

ఈ స్మార్ట్‌ ఫోనులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది, ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది కాకుండా, ఆండ్రాయిడ్ 10 ఆధారంగా,  XOS 6.0 UI లో పనిచేస్తుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 7 లైట్ : ప్రత్యేకతలు

ఇక ఇన్ఫినిక్స్ నోట్ 7 లైట్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ఒక 6.6-అంగుళాల HD + స్క్రీన్ పొందుతోంది మరియు దాని రిజల్యూషన్ 720 x 1600 పిక్సెల్స్ మరియు దాని ఆస్పెక్టు రేషియో  20: 9 గా వుంది. ఈ ఫోన్‌ లో పంచ్ హోల్ కెమెరా అందుబాటులో ఉంది మరియు ఇది మీడియాటెక్ హెలియో పి 22 SoC తో నడుస్తుంది. ఈ ఫోనుకు 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ లభిస్తోంది. మైక్రో SD కార్డ్ ద్వారా ఫోన్  యొక్క స్టోరేజిని పెంచవచ్చు.

ఈ ఫోన్ వెనుక భాగంలో 48 ఎంపి కెమెరా అందించబడింది మరియు 2 ఎంపి డెప్త్ సెన్సార్, 2 ఎంపి మాక్రో సెన్సార్ మరియు లో – లైట్ వీడియో అసిస్టెంట్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది, ఇది 10W ఛార్జింగుకు మద్దతు ఇస్తుంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :